దేశంలో సంచలనం సృష్టించిన కేసుల్లో అబ్దుల్లాపూర్ మెట్ కేసు ఒకటి.. తహశీల్దార్ ను ఓ వ్యక్తి పెట్రోల్ పోసి తన ఆఫీస్ లోనే తగలబెట్టడంతో సంచలనం సృష్టించింది.  ఈ కేసులో ఇప్పటికే నిందితుడు కూడా మరణించాడు.  అతనికి కూడా గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మరణించాడు.  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆర్డీవో ఆఫీస్ లో చూసిన లంచాలకు తీసుకోబడవు అని బోర్డులు పెట్టి మరి ప్రజలకు పనులు చేస్తున్నారు.  


అన్ని చక్కగా ఉన్నాయి అంటే పనులు చేసి పంపిస్తున్నారు.  గతంలో మాదిరిగా లంచాలు తీసుకోవడం లేదు.  లంచం అడిగితె ఏమౌతుందో అందరికి అర్ధం అయ్యింది. దీంతో లంచం ఇవ్వడానికి వచ్చినా తీసుకోవడానికి మాత్రం అధికారులు వెనకడుగు వేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, అబ్దుల్లాపూర్ మెట్ ఘటన మరువక ముందే మరో దారుణం జరిగింది.  


అదేమంటే, ఇటీవలే ఓ వ్యక్తి ఇసుక కావాలని చెప్పి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాడు.  అద్బుల్లాపూర్ మెట్ ఇసుక రిచ్ నుంచి సదరు వ్యక్తికి ఇసుకను సప్లై చేశాడు.  అయితే, ఇసుకలో మనిషి పుర్రె రావడంతో సదరు వ్యక్తి షాక్ అయ్యాడు.  వెంటనే రిచ్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు.  కంప్లైన్ట్ తీసుకున్న అధికారులు ఇసుక రిచ్ ను పరిశీలించారు.  


ఇసుక డంపింగ్ లో చీర, వాచ్, మహిళ తలకు సంబంధించిన ఇతర ఆనవాళ్లు బయటపడ్డాయి.  అయితే, అప్పటికే మృతదేహం పూర్తిగా డి కంపోజ్ అయ్యింది.  దీంతో మహిళ మృతదేహం ఎవరికీ సంబంధించినది అనే విషయం తెలుసుకోవడం కష్టం అయ్యింది.  8 నెలల క్రితం  మెహబూబ్ నగర్ నుంచి ఇసుకను అద్బుల్లాపూర్ మెట్ ఇసుక రిచ్ లో డంప్ చేశారు.  బహుశా అక్కడి నుంచి ఈ మృతదేహం వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.  మరి ఈ మృతదేహం ఎవరిదీ ఏంటి అనే దాని చుట్టూ పోలీసులు విచారణ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: