బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పట్టాయి. భారతదేశంలో బంగారం ధరలు తగ్గాయి అంటే ఆస్తులు అమ్మి అయిన సరే బంగారం కొనేస్తారు. అలాంటి ఈ బంగారం ధరలు ఒకరోజు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. అయితే గత నెల వరుకు భారీగా పెరిగిన బంగారం ధర కేవలం పది రోజులలో 750 రూపాయిలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయిల తగ్గుదలతో 39,190 రూపాయలకు చేరింది. 

                

అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 750 రూపాయిల తగ్గుదలతో 35,910 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

                 

కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 38,050 రూపాయలకు చేరింది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కు 37,880 రూపాయలకు చేరింది.  

                       

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. ఎందుకంటే రేపు మళ్ళి ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: