దిశ హత్యాచార ఘటనకు ముందే, సమత హత్యాచార ఘటన జరిగింది . కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం లో ఈ ఘటన చోటు చేసుకుంది . బాధితురాలి పేరు సమత గా మార్చి పోలీసులు దర్యాప్తు చేపట్టారు . ఈ కేసులో 44 మంది సాక్షులను విచారించి, 96  పేజీల నివేదిక ను పోలీసులు  సిద్ధం చేశారు .    దిశ హత్యాచార ఘటన నిందితుల్ని పోలీసులు ఎన్ కౌంటర్ లో హతమార్చగా ,  సమత నిందితులు సోమవారం నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ఎదుర్కోనున్నారు .

 

పోలీసులు పకడ్బందీగా రూపొందించిన నివేదిక ప్రకారం నిందితులకు ఉరిశిక్ష పడడం ఖాయమని తెలుస్తోంది . ఇక నిందితుల తరుపున ఎవరు వాదించరాదని జిల్లా బార్ అసోసియేషన్ నిర్ణయించడం పరిశీలిస్తే , నిందితులకు ఉరి తప్పకపోవచ్చుననే వాదనలు బలపడుతున్నాయి . సమత పై  నిందితులు అత్యాచారం చేసిన అనంతరం కత్తి పొడిచి , బండరాయి తో మోది అత్యంత క్రూరంగా హత్య చేశారు .

 

ఈ కేసులో నిందితులైన షేక్ బాబు , షాబుద్దీన్ , ముగ్దుమ్ లు బాధితురాలు  కదలకుండా  కాళ్ళు, చేతులు పట్టుకుని  ఒకరి తరువాత మరొకరు అత్యాచారం చేయడమే కాకుండా , షేక్ బాబు ఆమెను కత్తి తో పొడవగా , మిగిలిన ఇద్దరు బండరాయి తో తలపై మోదినట్లు పోలీసులు తమ  నివేదిక లో పేర్కొన్నారు . బాధితురాలు చేతులు నరకడం తో  బాధతో విల, విలలాడుతున్న నిందితులు అదేమీ పట్టించుకోకుండా , బ్రతికి ఉంటే తమ పేరు బయటకు చెబుతుందన్న ఏకైక కారణం తోనే బండరాయి మోది  హత్య చేశారని వెల్లడించారు .  ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో నిందితులకు ఎంత త్వరగా శిక్ష ఖరారు అవుతుందనేది హాట్ టాఫిక్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: