ఇప్పుడంటే వంటింట్లో ఉల్లి లొల్లి పెరిగింది గాని ఉల్లి లేకుంటే పొయ్యి వెలుగదు. ముద్ద దిగదు. ఇక ఉల్లి గురించి చెప్పాలంటే కొన్ని ఉల్లి ముక్కలేసుకు పానీపూరీ నిండా రసం నింపి నోట్లో వేసుకుంటే ఆ మజాయే వేరు! అదీ గాక హోటల్లో బిర్యాని ముద్ద దిగాలంటే అందులో ఓ ఉల్లి ముక్క నిమ్మకాయ కలిపి గొతులోకి జార్చితే ఆ టేస్టే వేరు! ఒకటేమిటి ఇలా ఎంతగానో మనుషులతో మమేకం అయ్యింది ఉల్లి..

 

 

ఉల్లి లేని వంటే లేదు! అంతలా జనంతో ఉల్లి బంధం అల్లుకుపోయింది. కానీ, ఇప్పుడు పట్టుకోవాలంటేనే ఉల్లి భయపెట్టిస్తోంది. కోయకముందే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఉల్లి రేటు సెంచరీ దాటేసింది. ఇకపోతే ఈ ఉల్లిని తీసుకునే విధంగా తీసుకుంటే మేలట కాని ఇది విషం కంటే డేంజర్ అట. అదెలా అంటే. సాధారణంగా హోటల్స్ లో గాని, విర్చి కొట్లు, పానీపూరి బండ్ల వద్ద ఉల్లిపాయలను కట్ చేసి పెడతారు. ఇలా కట్ చేసి ఉన్న ఉల్లి తినడం చాలా హానికారమన్న విషయం మీకు తెలుసా..?

 

 

మామూలుగా.. ఉల్లిపాయను కట్ చేసిన వెంటనే కొద్ది సమయం తేడాలో ఉపయోగిస్తే ఫర్వాలేదు. కానీ కట్ చేసిన ఉల్లిని కొన్ని గంటల తర్వాత తింటే అది విషంతో సమానమట. కాగా… వీటిపై పరిశోధన చేసిన పరిశోధికులు కూడా ఇదే విషయాన్నివెల్లడించారు. ఎప్పుడైనా ఉల్లిపాయలను.. కోసిన వెంటనే ఉపయోగించాలట. ఉల్లి ముక్కలను కోసిన కొన్ని గంటల తర్వాత వాటిని తింటే అవి విషంతో సమానమని వారు తెలియజేశారు.

 

 

ఇలా ఎందుకంటే.. ఉల్లిలో ఘాటు ఎక్కువ గనుక.. అది ఈజీగా గాలిలో ఉండే బ్యాక్టీరియాలను ఆకర్షిస్తుంది. దీంతో ఎక్కువ సమయం కట్ చేసి ఉన్న ఉల్లిని గనుక తీసుకుంటే.. కడపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి.. ఇక మీరు కూడా ఈ చిన్న టిప్‌ని ఫాలో అయి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండని సెలవిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: