సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న‌సేన పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగే అవ‌కాశం కనిపిస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే నేత‌లు ఆ పార్టీకి బైబై చెప్పేయ‌డం క‌నిపించ‌గా... గ‌త కొద్దికాలంగా అది ఉధృత‌మైంది. ఇక తాజాగా జ‌న‌సేన అధ్య‌క్షుడికి అత్యంత ఆప్తుడ‌నే పేరొందిన ఫిలాసఫ‌ర్ రాజు ర‌వితేజ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. మ‌రికొంద‌రు నేత‌లు పార్టీని వీడ‌నున్నార‌ని ప్ర‌కటించారు. అలా పార్టీ మార‌బోయే నేత సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ల‌క్ష్మీనారాయ‌ణ చేర‌నున్న‌ట్లు స‌మాచారం.

 

జ‌గ‌న్ సొంత జిల్లా రెడ్డి ఐపీఎస్‌పై వేటు...అమిత్‌షా ఆఫీసు సంచ‌ల‌న నిర్ణ‌యం

 

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ విష‌యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు కీల‌క ప‌రిణామం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతార‌ని భావించిన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌లో చేరారు. ఓ రోజు రాత్రి జ‌రిపిన చ‌ర్చ‌ల అనంత‌రం ఆయ‌న పార్టీలో చేరారు. జ‌న‌సేన‌ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కండువా కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కోట్లు తెచ్చే వృత్తిని వదిలి ప్రజాసేవ చేసేందుకు పవన్‌ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. డబ్బులు లేకుండా రాజకీయం జరగదన్న నేటి రోజుల్లో  మార్పులు కోసం‌ ఆయన పార్టీని స్థాపించారని చెప్పారు. కాగా, జ‌న‌సేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రకటించిన గేదెల శ్రీనివాస్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. దీంతో షాక్ తిన‌డం జ‌న‌సేన వ‌ర్గాల వంతయింది. తొలి జాబితాలో చోటు ద‌క్కించుకున్న వ్య‌క్తి...నామినేష‌న్ వేయ‌డానికి ముందే...పార్టీ ఫిరాయించేసిన నేప‌థ్యంలో....ఆ నియోజ‌క‌వ‌ర్గం కోసం బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అవ‌కాశం క‌ల్పించారు. అయితే, ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.

 

ర‌క్తం మ‌రిగిపోయే దారుణం...స్కూలు నుంచి పిలిపించి..సొంత బిడ్డ‌పై రేప్ చేసిన త‌ర్వాత‌

 

ఉన్న‌త విద్యావంతులు ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ల‌క్ష్మీనారాయ‌ణ‌ను బ‌రిలో దింపడం వ‌ల్ల ఆయ‌న గెలుపు సుల‌భం అవుతుంద‌ని జ‌న‌సేన లెక్క‌లు వేసిన‌ప్ప‌టికీ...ల‌క్ష్మీనారాయ‌ణ ఓట‌మి పాల‌య్యారు. అయితే, ఆనాటి నుంచి జ‌న‌సేన రాజ‌కీయాల్లో పెద్ద‌గా క్రియాశీలంగా లేరు. ఇటీవ‌లే రాయ‌ల‌సీమ‌కు జ‌న‌సేన ఇంచార్జీగా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఇంచార్జీగా నియ‌మించారు. అయితే, ఆ బాధ్య‌త‌లు ఇచ్చిన‌ప్ప‌టికీ ల‌క్ష్మీనారాయ‌ణ పెద్ద‌గా క్రియాశీలంగా స్పందించ‌డంలేదు. మ‌రోవైపు, ఆయ‌న‌తో బీజేపీ నేత‌లు ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఏపీలోని నేత‌ల‌ను పార్టీలు మార్పించే పనిలో బిజీగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఆయనతో టచ్ లో ఉన్నట్లు స‌మాచారం. దీంతో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ త్వరలో కాషాయ కండువా కప్పుకోవ‌చ్చున‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: