దిశ.. ఈ ఘటన తెలియని వారు ఉండరు. రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రజలను ఈ ఘటన కంటతడి పెట్టించింది. అల్లర్లు సృష్టించింది. నలుగురు మానవ మృగాలు కలిసి ఒక వెటర్నరీ వైద్యురాలైన దిశను అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా చేశారు. 

 

అలాంటి మానవ మృగాలను.. విచారిస్తుండగా సిన్ రీకర్రెక్షన్ చేస్తున్న సమయంలో పారిపోవడానికి ప్రయత్నిస్తూ పోలీసులపై ఎదురు దాడి చేశారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నలుగురు నిందితులపై ఎన్కౌంటర్ చేశారు. దీంతో ఆ నిందితులు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. అయితే అలా ఎన్కౌంటర్ తప్పు చెయ్యడం అని మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కోర్టుకెళ్లాయి. 

 

దీంతో ఆ నిందితుల ఎన్కౌంటర్ పై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే ఆ నిందితులు మృతి చెందటం వల్ల దేశం అంత సంబరాలు చేసుకుంటే ఆ నలుగురు నిందితుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అందులో చెన్నకేసువులు అనే నిందితుడి భార్య నిండు గర్భిణీ. 

 

భర్త మరణించినందుకు మొదట తీవ్ర  విషాదంలో ఉన్న ఆమె.. పక్కన వారి మాటలు విని... సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే.. నా మొగుడు పోతే పోయిండు.. నాకు 10 లక్షల డబ్బు.. ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇవ్వండి.' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు విన్న ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

 

అయితే ఆమె గురించి ఆమె భర్త గురించి విచారణలో ఓ సంచలన విషయం బయట పడింది. ఆ విషయం ఏంటంటే.. ఆమె, ఆమె భర్త మైనర్లు. ఈ విషయాలు కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే మొదట ఆమె మోర ఎవరు వినకపోగా ఆమె మైనర్ అనే విషయాన్ని నిర్ధారించుకున్న బాలల సంక్షేమ కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌.. ఆమెను తమ సంరక్షణలోకి తీసుకుంటామని, మేజర్‌ అయ్యేంతవరకు స్టేట్‌హోమ్‌లో ఉంచుతామని తెలిపారు. 

 

ఆమె గర్భవతి కావడంతో ఆసుపత్రి నుంచి వైద్యసహాయం కూడా అందిస్తామని తెలిపారు. వారి వివాహం చట్టపరంగా గుర్తింపు ఉండదని, పుట్టబోయే బిడ్డకు హక్కులు వర్తిస్తాయని తెలిపారు. మేజర్‌ అయిన తర్వాత బాలిక ఇష్టానుసారం వెళ్లవచ్చని, పుట్టేబిడ్డ విషయంలో కూడా ఆమె అభిప్రాయం మేరకే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇలా ఆమెను ఆ కమిటీకి తీసుకెళ్లడానికి కారణం ఆమెకు తల్లితండ్రి లేరు. ఇప్పుడు భర్త రక్షేశుడిలా ప్రవర్తించి ఎన్కౌంటర్ కు గురయ్యాడు. ఏది ఏమైనా అంత చిన్నవయసులోనే ఆమెకు 100 ఏళ్లలో జరగాల్సినవి అన్ని జరిగిపోయాయి. మరి ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉండనుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: