గొప్ప ఆశయంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఒక ప్రత్యేక ఎజెండాతో ప్రజలకు న్యాయం చేయాలనే ఆశయంతో మొదట్లో పవన్ ముందుకు సాగినట్లు కనిపించింది. కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఓడిపోయాక... ఇకనుంచి తనలో  అసలు సిసలైన రాజకీయ నాయకున్ని  చూస్తారంటూ పవన్ వ్యాఖ్యానించడం రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ తన పంథాను  కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పవన్ తన  రాజకీయ సిద్ధాంతాలను అన్నిటినీ పక్కనబెట్టి కుల మత రాజకీయాల వైపు వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలు పవన్ తీరు చూస్తే అందరూ అలాగే అనుకుంటున్నారట. 

 

 

 

 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పటినుంచి పదునైన వ్యూహం రచిస్తున్నారు అంటూ సమాచారం. మరోవైపు కుల మత రాజకీయాలను కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదును పెడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం గత కొన్నిరోజుజులుగా  పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి క్రిస్టియన్ అంటూ మతాన్ని ఎత్తిచూపుతూ విమర్శలు చేయడం అంతేకాకుండా శబరిమల ఆలయం విషయంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండటం లాంటివి వాటివల్ల పవన్ కళ్యాణ్ కుల మత రాజకీయాలకు కాలుదువ్వుతున్నాడు అంటూ అందరూ అనుకునేలా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ కు అతి సన్నిహితులైన రాజు రవి తేజ్ జనసేన పార్టీకి.. రాజీనామా  పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ పై వస్తున్న ఊహాగానాలకు ఊతమిస్తోంది. 

 

 

 

ఉభయ గోదావరి జిల్లాల నుంచే పవన్ కళ్యాణ్ తన కొత్త రాజకీయ ఎత్తుగడలు ప్రారంభించారని ప్రస్తుతం  ఆంధ్రా రాజకీయాలు చర్చించుకుంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో బ్రాహ్మణ రాజు లకు మంచి పట్టు ఉంది. ఇక కమ్మ కాపు కులాల అయితే ఒక వర్గానికి మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు బడుగు బలహీన వర్గాలు కూడా జగన్ వైపు  ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం వచ్చి జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం జరిపినప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలు జగన్ వైపే ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ రాజు, బ్రాహ్మణుల్ని తనవైపు తిప్పుకునే  ప్రయత్నాలు చేస్తున్నారని  సమాచారం. పరిస్థితులకు తగ్గట్లుగా తనలో తాను మార్పులు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: