భారతదేశ ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ గతంలో నిరుద్యోగం గురించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. అయితే ఆ వ్యాఖ్యలను కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటే... మరికొంతమంది నెగటివ్ గా తీసుకున్నారు. ఇంతకీ.. మోదీ ఏమన్నారంటే, 'నిరోద్యుగులుగా ఉండటం కంటే.. పకోడీలు అమ్ముకోవడం మిన్నా. పకోడీలు అమ్మోకొని రోజుకి రూ.200 సంపాదిస్తే అది ఉద్యోగం కాదా?' అని వ్యాఖ్యలను చేసారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు.


మోదీ ఈ వ్యాఖ్యలను చేసిన తరువాత ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురు నిరుద్యోగ యువకులు రూ.5000 తో పక్కోడి షాపు పెట్టి వారంలోనే 10 వేల రూపాయలు సంపాదించారు. వీళ్ళే కాదు చాలా మంది నిరుద్యోగులు మోదీ వ్యాఖ్యలు పాటించి పకోడీ హోటల్ లను ప్రారంభించి మంచి లాభాలను అర్జించారు. నిజానికి, వందకోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి ఉద్యోగాలు కల్పించడమనేది ఎవరికైన అసాధ్యమే. కానీ కొంతమంది యువకులు మాత్రం... చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుండా మోదీ పకోడీలు చేసుకోమంటున్నారని ఎద్దెవా చేస్తున్నారు.

తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి ఢిల్లీ లో చోటు చేసుకుంది. రామ్‌లీలా మైదానంలో జరిగిన కాంగ్రెస్ మెగా ర్యాలీలో పలువురు యువకులు గ్రాడ్యుయేట్స్ డ్రెస్ ధరించి పకోడీలు, టీ అమ్మారు. 'మోదీ చెప్పిందే జరిగింది' అని మెడలో ప్లకార్డులు వేసుకున్న యువకులు మోదీ సర్కార్ ని ఎద్దెవా చేసారు. ఉద్యోగాల కల్పనలో భాజపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసనలు చేపట్టారు. అలాగే, ఉల్లిపాయల ధరలు మిన్నంటుతున్నాయని మెడలో ఉల్లిపాయ దండలు వేసుకొని నిరసనలు చేసారు.


ఈ మెగా ర్యాలిలోనే ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వం ఉంటె ఇండియన్ రైల్వే ప్రైవేటీకరణ అవుతుందని, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుందని, 15 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. అయితే, నిరసనలు చేస్తున్న వ్యక్తులు ప్రియాంక గాంధీ మాటలకు చప్పట్లు కొడుతూ పెద్ద ఎత్తున స్పందించారు.

https://mobile.twitter.com/SajidQu41971335/status/1206117339172941825

మరింత సమాచారం తెలుసుకోండి: