ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన సమయం కేటాయించ లేకపోతున్నారు. అరే మా నాన్న నాతో కొంచెం సమయం ఉంటే బాగుంటుంది కదా అనుకునే చిన్నారులు ఎంతో మంది. కానీ కొంచెం ఎక్కువగా డబ్బులు సంపాదిస్తే తమ పిల్లల భవిష్యత్తు ఇంకొంచెం బాగా తీర్చిదిద్దవచ్చు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు  ఎక్కువ సమయం  వర్క్ చేస్తూ ఉంటారు. తమ పిల్లలు లేవక ముందే వెళ్లి పిల్లలు పడుకున్న తర్వాత వస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు. దీంతో చిన్నారులు తన తండ్రి తనతో కనీసం సమయం కూడా గడపడం లేదంటూ ఫీలవుతుంటారు. ఇక్కడ ఓ చిన్నారి  అలాగే ఫీల్ అయింది. ఫీల్ అవ్వడం తో సరిపెట్టలేదు  ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది. మా నాన్నకు  కాస్త జీతం  పెంచండి అప్పుడు ఆయన నాతో గడుపుతాడు అంటూ  లేఖలో పేర్కొంది చిన్నారి. ప్రస్తుతం ఈ లేక సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. 

 

 

 ఇది ఎక్కడ జరిగింది అంటారా.. మహారాష్ట్రలో జరిగింది. ఏకంగా తన తండ్రికి జీతం పెంచండి అంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసింది ఆరేళ్ళ చిన్నారి. మహారాష్ట్రలోని జాల్నా  ప్రాంతానికి చెందిన సచిన్ హారాలే ... మహారాష్ట్ర ఆర్టీసీలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అతని కూతురు శ్రేయ హరాలే స్థానిక పాఠశాలలో చదువుతోంది. అయితే ఆ కండక్టర్ కు వేతనం తక్కువగా ఉండటంతో తన  పిల్లల భవిష్యత్తు మెరుగ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అదనపు సమయం కూడా పని చేస్తూ ఉన్నాడు సదరు aa తండ్రి . ఈ క్రమంలో తన కూతురుతో కలిసి సమయాన్ని కూడా గడపడం లేదు . ఇక ఓ రోజు నాతో సమయం ఎందుకు గడపడం లేదని ఆ చిన్నారి తండ్రి ప్రశ్నించగా.. తనకు జీవితం తక్కువగా ఉందని అందుకే ఎక్కువ సమయం పని చేస్తున్నారని కూతురికి చెప్పాడు సచిన్ హారాలే . చిన్నారి తన తండ్రి  తనతో సమయం గడపడం లేదని ఎంత బాధపడినదో  ఏమో..తండ్రి  చెప్పిన మాటలను అలాగే మైండ్ లో పెట్టుకుంది. 

 

 

 ఇక ఏకంగా శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు లేఖ రాసింది ఆరేళ్ళ చిన్నారి. హాయ్ సార్... మా నాన్న నాతో ఎక్కువ సమయం గడపడం లేదు... ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో నేను సరిగ్గా చదువుకో లేక పోతున్నాను. మీరు మా నాన్నకి జీవితం పెంచితే ఆయన నాతో ఎక్కువ సమయం గడిపి స్కూల్కి తీసుకెళ్లడానికి కూడా అవకాశం ఉంటుంది. తన జీతం తక్కువ గా ఉండటం వల్ల ఎక్కువ సమయం పని చేస్తున్నానని  నాతో మా నాన్న చెప్పారు... మా నాన్నకి జీతం పెంచండి సార్ నాతో సమయాన్ని గడుపుతారు అంటూ ఆ చిన్నారి రాసిన లేఖ పోస్ట్ చేయమంటూ తండ్రికి ఇచ్చింది ఆ చిన్నారి. అయితే తనకు జీతం పెంచాలి అంటూ తన చిన్నారి కూతురు ముఖ్యమంత్రికి లేఖ రాసిందని... ఆర్డినరీ పోస్టు ద్వారా ఆ లేఖను  పోస్ట్ చేశానని ముఖ్యమంత్రికి చేరిందో లేదో తెలియదు అంటూ సచిన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: