జగన్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించే విపక్ష పార్టీల ఘాటు విమర్శలు చేస్తూ కౌంటర్ ఇస్తూ ఉంటారు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి. తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా విపక్షాల విమర్శలపై స్పందిస్తూ... సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి. తాజాగా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న అధికారుల బదిలీ పై టిడిపి పార్టీ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే... అధికారులను బదిలీ చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

 

 

 

 వీటిపై స్పందించిన వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయి రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఒక నెగిటివ్ మనిషి అని విజయసాయిరెడ్డి అభివర్ణించాడు.. చంద్రబాబులో  పూర్తిగా వ్యతిరేకత నిండిపోయింది అంటూ ఆయన ఆరోపించారు.చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించడం ప్రజల దురదృష్టకరమని విజయ్ సాయి రెడ్డి విమర్శించారు. రాజకీయాలలో తనకు 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి బదులు తిరోగమనం పట్టించేలా చేస్తుండడం దుర్మార్గమని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.... 

 

 

 జగన్మోహన్ రెడ్డి సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని... అవకాశవాద రాజకీయాలు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు అధికారుల బదిలీల పైన కూడా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంటే.. టీడీపీ అధినేత ప్రతిపక్షనేత అయిన చంద్రబాబు నాయుడు మనసు అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతుందని... అందుకే జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు నాయుడు అనవసర విమర్శలు చేస్తున్నారని కామెంట్ చేశారు వైసీపీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: