తాజాగా కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఈశాన్య రాష్ట్రాలు సహా విపక్షాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇదే కాకుండా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు మంగళవారం బంద్ కూడా నిర్వహించాయి. ఇంతే కాకుండా ర్యాలీలు, ఆందోళనలు, భారీ ప్రదర్శనలు నిర్వహించగా, ఇలాంటి బిల్లును తీసుకురావడం తగదని దాదాపు వెయ్యి మంది మేధావులు, కళాకారులు ఇదివరకే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ బిల్లు మీద ఇప్పటికే.. బంగ్లాదేశ్ సరిహద్దు గల ఈశాన్య భారతంలో భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి.

 

 

సరిహద్దుకు ఆవలి నుంచి వచ్చిన వలసదారులు తమను ముంచెత్తుతారని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పౌరసత్వ సవరణ బిల్లు కు పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో ఆమోదం పొందటం.. బీజేపీకి ఒక పరీక్షే అవుతుంది. ఒక బిల్లు చట్టంగా మారాలంటే దానిని పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడూ ఈ పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనలు ఏపీని తాకాయి. ఈ నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు పలు అల్లర్లకు పాల్పడుతుమ్మాయి, అదిగాక బెంగాల్‌లో చెలరేగుతున్న అల్లర్లతో ఉత్తరాది నుంచి రాష్ట్రానికి రావాల్సిన రైళ్లు రద్దయ్యాయి. ఇటు నుంచి వెళ్లాల్సిన రైళ్లను కూడా అధికారులు నిలిపివేయడం వల్ల విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అందోళనకు దిగారు.

 

 

ఈ సందర్భంగా ఫలక్‌నుమా, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో ముందుగా టికెట్లు తీసుకున్న ప్రయాణికులు తమను తమ గమ్యస్థానాలకు చేర్చాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా ఈశాన్య రాష్ట్రాలతోపాటు బెంగాల్‌లో కొనసాగుతున్న నిరసనల కారణంగా 15 రైళ్లను రద్దు చేయగా.. మరో 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. ఇక పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పలుచోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హావ్‌డా-ఖరగ్‌పూర్‌ మార్గంలో పలు స్టేషన్ల వద్ద ప్రయాణికులు ఆందోళనలకు దిగారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: