2007లో విజయవాడ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు ఎంతో సంచలనం సృష్టించింది. విజయవాడలోని ఒక ప్రైవేట్ హాస్టల్ లో దారుణ హత్యకు గురైన ఆయేషా మీరా మరణానికి కారకులు ఇప్పటివరకు తెలుసుకోలేదు పోలీసులు. కానీ 12 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన గురించి ఎవరు చేశారో ఇంతవరకు తేల్చలేకపోవడం నిజంగా విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పుడు హైకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించింది. దీంతో శనివారం సిబిఐ అధికారులు అయేషా మీరా డెడ్ బాడీ వద్దకు వెళ్లి రీ పోస్ట్ మార్టం నిర్వహించారు.

 

 తెనాలి లో ఉన్న చెంచుపేట ముస్లిం స్మశానవాటికలో సిబిఐ అధికారులు ఆమె అవయవాలను సేకరించారు. దేశంలోని పలు చోట్ల నుంచి వచ్చిన దాదాపు 20 మంది అధికారులు, వైద్య నిపుణులు ఈ పంచనామా ప్రక్రియలో పాల్గొన్నారు. నిన్న ఉదయం మత పెద్దలు సమక్షంలోనే అయేషా మీరా ఖననం చేసిన స్థలాన్ని గుర్తించి అక్కడ సమాధిని తిరిగి తవ్వి లోపల ఉన్న ఎముకలను సేకరించి అస్తిపంజరం రూపంలో వాటిని అమర్చారు. వాటిలోని కొన్ని అవశేషాలను సేకరించి మిగితా అవయవాలను తిరిగి పూడ్చారు.

 

ఈ అత్యాచారం హత్య జరిగి దాదాపు 12 సంవత్సరాలు జరగడంతో. ఆమె పురే, ఎముకలు మాత్రమే అధికారులకు లభించాయి. లభించిన ఆధారాల ప్రకారంగానే ఆయేషా కు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి వారు పరిశీలించారు. పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీటు ప్రకారం తలకు బలమైన గాయాలు కావడంతో నే చనిపోయిందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు సిబిఐ అధికారులు ఫోరెన్సిక్ పరీక్షలు చేసిన తర్వాత అసలు నిజం బయటికి వస్తుంది.

 

అప్పటిలో అయేషా మీరాను చంపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లోని ఒక ముఖ్య నేత మనవడిని ఆరోపణలను గట్టిగా వచ్చాయి. కానీ రాజకీయ పలుకుబడితో ఈ కేసులో ఒక చిన్న దొంగను చూపి జైలుకు పంపారని ఎన్నో విమర్శలు వచ్చాయి. చివరికి హైకోర్టు కూడా ఆ దొంగను నిర్దోషిగా తీర్పునిచ్చింది. దీంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: