ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరుపై ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. కుల, మతాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారు...రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హ‌రించిన‌ తీరు వివాదాస్ప‌దంగా ఉంద‌న్నారు. సభలోకి ఊరేగింపుగా కార్యకర్తలతో వచ్చేప్రయత్నం చేశారని శ్రీ‌కాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షనేతకు ప్రత్యేక ధ్వారం ఉన్నా కూడా వేరే ద్వారం గుండా వచ్చారన్నారు. ``అల్లరి మూకలతో వచ్చే ప్రయత్నం చేశారు. సభలోకి వచ్చేటప్పుడు సభ్యులు మాత్రమే రావాలి.చంద్రబాబుకు బ్లాక్‌ క్యాట్‌ కమెండోల భద్రత ఉంటుంది.మార్షల్స్‌ ఆపితే బాస్టర్డ్‌ అని మాట్లాడటం,ఉద్యోగస్తులనే గౌరవం లేకుండా మీ గుండెల్లో నిద్రపోతా...మీ గుండెలు చీలుస్తా....చినబాబు లోకేష్‌ మాట్లాడటం.ఇదా సంస్కారం,ఇదా విధానం.ఎందుకోసం ఇలా చేయాల్సి వచ్చింది? `` అని ప్ర‌శ్నించారు.

 

ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం లేకపోవడం, ప్రభుత్వంలో లోటుపాట్లు ఏమీ లేవు కాబట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని శ్రీ‌కాంత్ రెడ్డి ఆరోపించారు. ``నాలుగోరోజు నిత్యావసరాలపై కూడా చర్చించాం. ఉల్లిపాయల కోసం కాదు మృతి చెందింది అని స్వయంగా కుటుంబసభ్యులు చెప్పారు. మా సాంబిరెడ్డి చనిపోయింది ఆరోగ్యం బాగాలేక అని క్లియర్‌గా చెప్పినా కూడా నేషనల్‌ మీడియాకు వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఇయ్యకుండా ఎల్లో మీడియాలో తప్పుపట్టించి దాంట్లో కూడా రాయిస్తారు దుర్మార్గమైన రాతలు రాయిస్తారు` అని ఆరోపించారు.

 

టీడీపీ బాకా పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో రాయించుకుని అల్ప సంతోషం పొందుతున్నారని శ్రీ‌కాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ``నీచ సాంప్రదాయానికి తెరలేపుతున్నారని. నిత్యం ప్రజల గురించి ఆలోచన చేసే ఓ వ్యక్తికి కులాన్ని ఆపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు.కులాలమధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఈ దుష్టఆలోచనను మానుకోవాలి. మీకు ధైర్యం ఉంటే ఈ రోజున గ్రామ సచివాలయాల్లో లక్షా నలభై వేల పోస్టులు ఇస్తే అందులో 82.5 శాతం పోస్టులు ఎస్సిఎస్టి బిసి మైనారిటిలకువచ్చాయని ఛార్ట్‌ లు చూపించాం. అలా ఇచ్చిన ఘనత మా నేత జగన్‌ది. వాటిపై మాట్లాడలేక సలహాదారులను పలానా వారికి ఇచ్చారనే దుర్భుధ్దితో మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే దానిపై మాట్లాడండి. 50 శాతం పదవులు మహిళలకు,బడుగుబలహీన వర్గాలకు ఇచ్చిన దానిపై మాట్లాడండి. దిశ చట్టంపై చర్చ పెట్టండి. కేబినెట్‌లో 50 శాతం అధికంగా మంత్రులను బడుగు బలహీన వర్గాలను తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ గారు అన్నఅంశంపై చర్చ పెట్టే ధైర్యం మీకు లేదు.`` అని ఎద్దేవా చేశారు.

 

సిగ్గుమాలిన తనంగా పలానాకులాల వారికి సలహాదారుల పోస్టులు ఇచ్చారని చెబుతారా అంటూ ఆరోపించారు. ``డీజీపీ ఆఫీసులో పోస్టు సంగతి కూడా మాట్లాడతారా?మీ హయాంలో కన్సల్టెన్సీల లిస్ట్‌ బయటపెడితే సిగ్గుతో తలవంచుకుంటారు. వారికి వేయినుంచి రెండు వేల కోట్లు జీతాలకు చెల్లించారు. ఎందుకు కులాల గురించి మాట్లాడతారు. మీకు ఉంటుంది కులజాఢ్యం.వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎప్పుడూ ఉండదు. మానవత్వమే మా మతం,మాట తప్పని కులం అని మానేత చెప్పారు.` అని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: