ప్రస్తుతం   ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేస్తున్నా ఆందోళనలు ఇప్పటికి అలాగే కొనసాగుతున్నాయి. బెంగాల్‌లో  కూడా ఈ చట్టంపై నిరసనలు చేస్తున్నారు. మరో వైపు గువహటిలో నిరసనలు హింసాత్మకంగా మారి ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పొవడం జరిగింది. ఈ హింసాత్మకంగా  ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇక ఏకంగా పశ్చిమ్ బెంగాల్ లో ఐతే  సీఎం మమతా బెనర్జీ సైతం తాము ఈ చట్టాన్ని అమలుచేసేది లేదని స్పష్ఠంగా తెలియచేయడం జరిగింది.

 

 ఈ తరుణంలో తాజాగా పౌరసత్వ సవరణ చట్టం సెగలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్‌లో చెలరేగుతున్న అల్లర్లతో పలు రైళ్లను రద్దు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా బెంగాల్‌లో రైల్ రోకోలు నిర్వహిస్తుండటంతో ఉత్తరాది నుంచి ఏపీకి రావాల్సిన పలు రైళ్లు రద్దు కాగా, ఇటు నుంచి వెళ్లాల్సిన రైళ్లను కూడా అధికారులు నిలిపివేయడం జరిగింది.

 

ఇక మరో వైపు  హౌరా వైపు వెళ్లాల్సిన, రావాల్సిన రైళ్లు రద్దు కావడంతో విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక కోల్‌కతాకు వెళ్లాల్సిన ఫలక్‌నుమా, కోరమండల్‌, హౌరా ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయడం జరిగింది అని రైల్వే  అధికారులు తెలియచేయడం జరిగింది. సడన్ గా ఇలా రద్దు చేస్తే  మా పరిస్థితి ఏమిటి అని  ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది.

 


ఇక పలు రద్దు ఐనా వివరాలు ఇలా.. హౌరా-తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్, హౌరా-ఎర్నాకులం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్‌పూర్ దురంతో, హౌరా- హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్, హౌరా-ముంబై గీతాంజలి ఎక్స్‌ప్రెస్, హౌరా-పూరీ శ్రీజగన్నాథ్ ఎక్స్‌ప్రెస్, సత్రాగచ్చి-పూరీ ఎక్స్‌ప్రెస్, హౌరా-పూరీ వీక్లీ, పూరీ-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్, తిరుపతి-హౌరా, యశ్వంత్‌పూర్-హౌరా, హైదరాబాద్-హౌరా రైళ్లు రద్దు చేయడం జరిగింది. ఇక పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనల ప్రభావం దేశంలోనే కీలకమైన ఖరగ్‌పూర్ జంక్షన్ మీదుగా ప్రయాణించే అన్ని రైళ్లపై బాగా ప్రభావం పడింది అని రైల్వే  అధికారులు వెల్లడిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: