విభజనతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో మరియు అదే విధంగా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి అదేవిధంగా నష్టపోయారని అంటారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. 'ఓటుకు నోటు కేసులో' దొరికిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరం నుండి ఓవర్ నైట్ లోనే పెట్టే బేడా సర్దుకుని హైదరాబాదులో ఉన్న పరిపాలన మొత్తం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు తీసుకువచ్చారని చాలామంది అంటుంటారు. కేవలం 'ఓటుకు నోటు కేసులో' ఇరుక్కోవడం వల్ల చంద్రబాబు మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారులను కూడా ఇరుకున పెట్టే విధంగా చంద్రబాబు నిర్ణయాలు తర్వాత తీసుకున్నారని ...ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో కేంద్రంలో కూడా చంద్రబాబు నోరు మెదప లేని పరిస్థితి ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకోవడం జరిగిందని చాలామంది చంద్రబాబుపై విమర్శలు చేస్తుంటారు.

 

తన రాజకీయ జీవితం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు తాకట్టు పెట్టారని ఓటుకు నోటు కేసు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేస్తుంటారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఆయన స్థానంలో చంద్రబాబు తనపై ఉన్న కేసుల విషయంలో స్టే విధించుకున్న క్రమంలో తాజాగా కొత్త ఉత్తర్వుల మేరకు పాత కేసులపై స్టే ఉన్న కేసులపై విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ఆదేశించడంతో చాలా కాలం తరువాత, చంద్రబాబుపై  ఆదాయానికి మించి ఆస్తులున్న కేసు, ఓటు కు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆ కేసులను తిరగదోడేందుకు రంగం సిద్ధమయ్యింది.

 

ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులలో ఆదాయానికి మించి ఆస్తుల కేసు ఓటుకు నోటు కేసు కంటే తలదన్నే కేసు అని… ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల చాలామంది రాజకీయ విశ్లేషకులు మరియు కొంతమంది సీనియర్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. ఈ కారణంగానే తెలుగుదేశం పార్టీలో నుండి చాలామంది నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారని చంద్రబాబు జైలుకు వెళితే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడటం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: