జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులందరికీ చేయూతనిచ్చేందుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.  ప్రతి ఏటా 13, 500  రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయించింది జగన్ సర్కార్ . కాగా  జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా నగదు కాస్త  ఇక్కడ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. తమ్ముడికి చెందిన భూమి ఇంకా అన్న  పేరు మీదే ఉండటంతో రైతు భరోసా సొమ్ము విషయాల్లో అన్నదమ్ములు ఇద్దరికీ గొడవ తలెత్తగా  తుపాకీతో కాల్చుకునేంతవరకు వరకు వెళ్ళింది . 

 

 

 వివరాల్లోకి వెళితే... ఏపీలో జగన్ సర్కార్ పై రైతులకు చేయూత నిచ్చేందుకు రైతు భరోసా పేరుతో సరికొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఏటా 13500 ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పథకం ద్వారా వచ్చిన నగదుతో  అన్నదమ్ముల  మధ్య వివాదం తలెత్తింది. విశాఖపట్నం జిల్లాలోని హుకుంపేట మండలం రంగశీలలో  ఈ ఘటన చోటుచేసుకుంది. రంగశీల కు చెందిన ఇద్దరు  అన్నదమ్ముల భూమి అన్న  కృష్ణ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. దీంతో ప్రభుత్వం ఇస్తున్న  వైఎస్సార్ రైతు భరోసా డబ్బులు అన్న కృష్ణ ఖాతా లోకి వచ్చాయి. అయితే ఆ డబ్బులు నుంచి తన వాటా ఇవ్వమని అన్న కృష్ణ ను కోరాడు  తమ్ముడు. అయితే రైతు భరోసా లో తన వాటా డబ్బులు తమ్ముడు అడిగినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన అన్న కృష్ణ.. తమ్ముడు కుటుంబం పై ఏకంగా  తుపాకీతో దాడి చేశారు. 

 

 

 తన వద్ద ఉన్న నాటు తుపాకీతో తమ్ముడు కుటుంబం పై కాల్పులు జరిపాడు అన్న కృష్ణ . ఈ ఘటనలో తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. కాగా  స్థానికుల సాయంతో కొండమ్మను  చికిత్స నిమిత్తం కెజిహెచ్  ఆస్పత్రికి తరలించి  చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కాల్పులకు పాల్పడ్డ అన్న కృష్ణ పరారీలో ఉన్నాడు. కాగా రైతు భరోసా నగదు వివాదం కాస్త కాల్పుల వరకు వెళ్లడంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: