కేంద్రం కొన్ని నెలల క్రితం జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లడఖ్ ను విడదీసిన విషయం తెలిసిందే. కానీ కొన్ని రోజుల నుండి ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు వైరల్ అవుతూ ఉండటంతో కేంద్రం ఈ వార్తల గురించి స్పందించింది. 
 
కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా అంశం గురించి స్పందిస్తూ కేంద్రం దగ్గర అలాంటి ప్రతిపాదన లేదని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి వైరల్ అవుతున్న వార్తల గురించి స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కుట్ర జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పిస్తారంటూ జరుగుతోన్న ప్రచారం వెనుక ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 
ఆర్టికల్ 370 వలన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ప్రయోజనం పొందాయని అందువలన రద్దు చేసిన ఆర్టికల్ 370 గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్గాలు త్వరలో కేంద్ర పాలిత ప్రాంతాలలో నివాస విధానం గురించి విధివిధానాలను ఖరారు చేయబోతున్నట్లు తెలిపాయి. 15 సంవత్సరాల పాటు కేంద్రపాలిత ప్రాంతాలలో నివాసం ఉన్నవారిని స్థానికులుగా గుర్తించాలనే అంశంపై కూడా ప్రభుత్వ వర్గాలు తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 
 
లడఖ్, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో హక్కులు, భూ యాజమాన్యం మొదలైన విషయాల్లో స్థానికత అంశం ముఖ్యమైనది. ఉన్నత విద్యా సంస్థలకు ప్రవేశాల్లోను, సివిల్ సర్వీసెస్ లోను స్థానికత అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం వ్యాపారులకు, పరిశ్రమలు స్థాపించేవారికి ఈ నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: