ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2019 ఎన్నికల సమయంలో ప్రపంచ శాంతి పార్టీ వ్యవస్థాపకుడు క్రైస్తవ మత ప్రబోధకుడు కె ఏ పాల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఏపీలో ఎన్నికలు ముగిశాక వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక కె ఏ పాల్ అమెరికా వెళ్లిపోవడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమాలో తన పాత్రను పోలిన విధంగా క్యారెక్టర్ రాంగోపాల్ వర్మ చిత్రీకరించారని అమెరికా నుండే ఇటీవల కొన్ని మీడియా చానల్స్ తో పాల్ మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా సినిమా గురించి అమెరికా నుండి స్కైప్ ద్వారా సామాజి గూడ ప్రెస్ క్లబ్ లో తన అభిప్రాయాలను వెల్లడించారు.

 

'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' సినిమా ద్వారా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని తన పేరును కూడా వాడుకోలేని పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ ఉండాలని కె ఏ పాల్ ఆరోపించారు. "సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు కొన్ని మార్చి సినిమా సెట్ చేసాడు. రాం గోపాల్ వర్మ నోరు విప్పితే అబ్దద్దాలే. అలాంటి వ్య‌క్తి దేవుడిని క్షమాపణ కోరితే మంచిది." అని పాల్ సూచించారు. 'ఇప్పటికైనా దేవుని దయ ఆయన పైన ఉంటే మంచి సినిమాలు చేస్తే మంచిది... ఇలాంటి పిచ్చి సినిమాలు తీయకపోతేనే మంచిది..' అని సూచించారు. ప్రస్తుతం తాను యూఎస్ లో ప్రెసిడెంట్ ట్రంప్ ని కలవడానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

 

నెల రోజుల నుండి ఇక్కడే ఉంటున్నట్లు నాకు పబ్లిసిటీ అవసరం లేదని ప్రస్తుతం ప్రపంచ శాంతి కోసం తాను ప్రయత్నిస్తున్నానని మన దేశ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల నాతో ఫోన్లో మాట్లాడారు అని అమెరికాలో ఫుల్ షెడ్యూల్ తో బిజీ బిజీగా గడుపుతున్న ఇది నా రేంజ్ నాకు పబ్లిసిటీ అవసరం లేదు అన్నట్టుగా స్కైప్ ద్వారా సోమాజిగూడా ప్రెస్ క్లబ్ కేంద్రంగా కె ఏ పాల్ తన అభిప్రాయాలను తెలిపారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పులు చేయడం లో కాదు అభివృద్ధి చేయడంలో దృష్టి పెట్టాలని కేపాల్ అమెరికా నుండి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పై సెటైర్లు వేశాడు. కావాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కోట్లు లాభాలు రావాలంటే నేను ఉచితంగా సలహాలు ఇస్తానని ఓపెన్ ఆఫర్ కె ఏ పాల్ ఇవ్వటం జరిగింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: