టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ నటించిన రూలర్ సినిమాని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో విశాఖపట్నంలోని 4 నియోజికవర్గాలలో టీడీపీ గెలిచింది. అయితే.. ఈసారి... వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే వైజాగ్ మున్సిపాలిటీ ఎన్నికలలో వైసీపీ జెండా ఎగురవేసి ప్రతీకారం తీర్చుకోవాలని జగన్ ఎన్నో అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టారు. దీంతో మహా విశాఖ నగర పాలక సంస్థ విశాఖ ఎన్నికలలో వైసీపీ పార్టీ జెండాను ఎగరవేయడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది.


నిన్న అనగా శనివారం రోజు విశాఖ లో బాలయ్య 'రూలర్' సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు పలువురు టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు. నిజానికి, ఈ ఈవెంట్ సినీ వేడుకలగా కనిపించినా, దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని టీడీపీ నేతలు బయటపెటినట్లు తెలుస్తుంది.


ఇకపోతే, జనవరి నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం కోసం అటు ఎన్నికల సంఘం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ తర్వాత జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించనుంది ఏపీ సర్కార్. సో, విశాఖ ఎన్నికల సమయం దగ్గరపడుతుంది కాబట్టి.. బాలయ్య నటించిన రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అందివచ్చిన అవకాశంలా తీసుకొని దాన్ని అనుకూలంగా మార్చుకున్నారు చంద్రబాబు. అందుకే ఆ సినీ ఫంక్షన్ ను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారట. ఈ విధంగా టీపీడీ కేడర్ లో ఉత్సహం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నం చేసారని తెలుస్తుంది. రూలర్ సినిమాలో కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పవర్ కట్ గురించి, మద్యపాన నిషేధంతో పాటు మరికొన్ని డైలాగ్ లు రాజకీయంపైన ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: