తాజాగా  కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ  కాంగ్రెస్ పార్టీ భారత్ బచావ్ పేరుతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నేతలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పి చిదంబరంతో పాటు  కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు అందరు కూడా హాజరు అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ నేతలు విమర్శలు వర్షం కురిపించారు. ప్రజలను  కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదు అని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.

 

ఇక ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... రోజు రోజుకూ దేశంలో  నిత్యావసర వస్తువుల ధరలు బాగా ఆకాశాన్ని అంటుతున్నాయి, వాటిని తగ్గించ వలసిన  ప్రభుత్వం వారికీ ఏమి తెలియనట్లు  ప్రవర్తిస్తుంది అని ప్రియాంక తెలిపారు. ఇక  ఆరేళ్ల బీజేపీ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు కాదు కదా ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయి అని మండిపడ్డారు. జీఎస్‌టీ వల్ల వ్యాపారులు నష్టపోయి, వ్యాపార సంస్థలు చాల ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. వాస్తవానికి అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటె వారిని పిరికి వారిగా చూస్తారు అని తెలిపారు.

 


మరు వైపు ఆర్థిక వ్యవస్థ బాగా పడిపోతుంది అని, వృద్ధిరేటు కూడా బాగా తగ్గిపోయి, ద్రవ్యోల్బణం బాగా పెరుగుతుంది అని  ప్రియాంక తెలిపారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ అంతా బాగానే ఉంది అని తెలియచేయడం జరిగింది. మరో వైపు చిదంబరం  మాట్లాడుతూ ఒక వైపు దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతోంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం చాలా బాగుంది అని మండిపడ్డారు. కేవలం ఆరు నెలల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థను చాల ఇబ్బంది పాలు చేసింది అని చిదంబరం   అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: