సరిగ్గా దేశంలో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆడవాళ్ళ పై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు జరిగిన సందర్భంలో దిశ హత్య అత్యాచారం ఘటన జరిగిన తర్వాత ఎప్పుడో 12 ఏళ్ల క్రితం జరిగిన అయేషా మీరా హత్య కేసు విషయమై మళ్లీ విచారణ మొదలు కావడం తో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయ్యింది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు విషయమై అయేషా మీరా తల్లి తాజాగా మరోసారి పోరాటానికి సిద్ధపడింది. తాజాగా అయేషా మీరా డెడ్ బాడీ కి మరోసారి పోస్టుమార్టం జరగటంతో అయేషా మీరా తల్లి బేగం సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

అప్పట్లో ఈ సంఘటన జరిగిన సందర్భంలో రాజకీయాల్లో ఉన్న రోజా ఇష్టానుసారంగా మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని అయేషా మీరా తల్లి బేగం ప్రశ్నలు వేసింది. నా కూతురు చావుకి కారణం ఎవరో రోజాకి తెలుసని ఎందుకు స్పందించడం లేదని నా కూతురు చావుకి కారణమైన నిందితులు ప్రతి ఒక్కరు గురించి రోజా కి స్పష్టమైన అవగాహన ఉందని షాకింగ్ కామెంట్ చేసింది. మరోపక్క వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే ఆ కేసుకు సంబంధించి 21 రోజుల్లో విచారణ మొత్తం చేపట్టి దిశ యాక్ట్ కింద జైల్లో పెడతామని కొత్త చట్టాన్ని తీసుకురావడంతో అయేషా తల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి.. దీనిపై రోజా ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్పట్లో 2007వ సంవత్సరంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో డిసెంబర్ నెలలో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అయేషా మీరా దారుణ హత్యకు గురయ్యారు.

 

ఈ కేసుకు సంబంధించి ప్రతి అంశం సంచలనంగా మారటమే కాదు.. ఫజిల్ గా మారింది. ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న సత్యంబాబును 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇదే తరుణంలో అయేషా తల్లి కూడా సత్యంబాబు నిర్దోషి అని అతనికి ఏ పాపం తెలియదని స్వయంగా అయోధ్య తల్లి బేగం కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో ఈ కేసులో అసలైన దోషి ఎవరు అన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: