దేశవ్యాప్తంగా ఉల్లి ధర  భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఉల్లి ధర దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో ఉల్లి కి డిమాండ్ భారీగా ఏర్పడి ఒక్కసారిగా ధరలు ఆకాశాన్నంటాయి. వందరూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉల్లి ధరలు పెరిగిపోవటం గమనార్హం.దీంతో  పెరిగిన ఉల్లి ధరలతో సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. భారీగా పెరిగిన ఉల్లి ధరలతో ఉల్లిని కోయకుండానే కంటనీరు పెట్టిస్తుంది  సామాన్య ప్రజలను . ఇంకేముంది భారీగా పెరిగిన ధరలతో ఉల్లి లేకుండానే   వంటలు కానిచ్చేస్తున్నారు . దేశంలోని ప్రతి చోటా భారీగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

 

 

 ఇదిలా ఉంటే మరోవైపు ఉల్లి  రైతుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. ఒకప్పుడు ఉల్లి ధర 20 నుంచి 30 రూపాయలు మాత్రమే పలికేది కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 100 రూపాయల నుంచి 200 వరకు ఉల్లి ధర పలకడంతో.. ఉల్లి  రైతుల పొలాల్లో ఉల్లికి బదులు బంగారం పండినట్లయింది. దీంతో ఎన్నడూ లేనంతగా లాభాలను చవిచూస్తున్నరు ఉల్లి రైతులు. ఇన్ని రోజుల వరకు ప్రభుత్వాన్ని మద్దతు ధర కల్పించాలని ఎన్నోసార్లు కోరినప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదని.. కానీ ఇప్పుడు తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనీ  ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలు ఉల్లి ధర భారీ రేటు పలుకుతున్న డంతో... ఒక రేంజ్ లో లాభాలు గడిస్తున్నారు రైతులు . 

 

 

 ఏకంగా ఉల్లి రైతులు లక్షల్లోనే లాభాలను సంపాదిస్తున్నారూ . భారీగా పెరిగిన ఉల్లి ధరలతో ఇక్కడ ఒక రైతు ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు. దీంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఘటన జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున రుణం తీసుకుని ఉల్లిని సాగు చేస్తూ ఉంటాడు. ఈ ఏడు కూడా అలాగే చెసాడు . 15 లక్షల రుణం తీసుకుని ఉల్లి పంటను సాగు చేశారు రైతు మల్లికార్జున. దాదాపు 240 టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది . అదే సమయంలో ఉల్లి  క్వింటాలుకు  దాదాపు 12 వేల రూపాయలకు పెరిగిపోవడంతో... తాను పండించిన 240 క్వింటాల్  ఉల్లి  అమ్మడంతో నెలరోజుల్లోనే కోటీశ్వరుడు అయిపోయాడు ఈ రైతు.

మరింత సమాచారం తెలుసుకోండి: