ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తరచూ చెప్పుకునే చంద్రబాబునాయుడుకు అసెంబ్లీ సీన్ రివర్స్ అయిపోతోంది. ఒకపుడు చంద్రబాబు దగ్గర పనిచేసిన వాళ్ళే ఇపుడు ఒక్కొక్కళ్ళుగా  అసెంబ్లీలో చంద్రబాబు  దమ్ము దులిపేస్తున్నారు.  విచిత్రమేమిటంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు, మాట్లాడుతున్న మాటలకు  చంద్రబాబు వైపు నుండి ఒక్క సమాధానం కూడా ఉండటం లేదు.

 

నగిరి ఎంఎల్ఏ రోజా, భీమిలీ ఎంఎల్ఏ అవంతి శ్రీనివాస్, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి, గుడివాడ ఎంఎల్ఏ కొడాలి నాని, స్పీకర్ తమ్మినేని సీతారామ్, గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ  ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. వీళ్ళంతా ఒకపుడు టిడిపిలో చంద్రబాబు నాయకత్వంలో పని చేసిన వాళ్ళే. కొడాలినాని, రోజా లాంటి వాళ్ళైతే తమ రాజకీయ జీవితాన్ని ఆరంభించింది కూడా తెలుగుదేశంపార్టీతోనే అన్న విషయం అందరికీ తెలిసిందే.

 

వివిధ కారణాలతో వాళ్ళంతా టిడిపిని వదిలేసి ప్రస్తుతం వైసిపిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో మంచి మెజారిటితోనే తెలుగుదేశంపార్టీ అభ్యర్ధులపై గెలిచారు. ఎప్పుడైతే  టిడిపి ఘోరంగా ఓడిపోయి వైసిపి అధికారంలోకి వచ్చిందో చంద్రబాబుకు కష్టకాలం మొదలైంది.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబును మొదటినుండి వ్యతిరేకిస్తున్న కొడాలినానికి జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించారు. దాంతో చంద్రబాబు అంటేనే నాని రెచ్చిపోతున్నారు.

 

అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నోరు విప్పుతున్నారంటేనే  ఎదురుదాడి చేయటానికి నాని, రోజా,  అవంతి లాంటి వాళ్ళు రెడీగా ఉంటున్నారు. దానికి తోడు చంద్రబాబు కూడా చాలా చీప్ గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న చవకబారు వ్యాఖ్యలు కూడా ప్రత్యర్ధులకు అంది వస్తున్నాయి. దాంతో చక్కగా  అడ్వాంటేజ్ తీసుకుని చంద్రబాబును నోరెత్తే అవకాశం లేకుండా  వాయించేస్తున్నారు.

 

అసెంబ్లీ చంద్రబాబు అవస్తలు చూస్తుంటే నిజంగానే బాధేస్తోంది. గుడివాడలో ఓ వ్యక్తి ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో మరణించాడనే తప్పుడు ప్రకటన చేసి నాని చేతిలో చంద్రబాబు తలంటిపోయించుకున్నారు. కుటుంబసభ్యులు కూడా తమ తండ్రి ఉల్లిపాయల కోసం వెళ్ళి చనిపోలేదని చెబుతున్నా చంద్రబాబు మాత్రం ఒప్పుకోవటం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్లే అసెంబ్లీలో అందరూ చంద్రబాబు మీద రెచ్చిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: