అనేక ట్విస్టుల మ‌ధ్య మ‌హారాష్ట్రలో ఏర్ప‌డిన శివ‌సేన‌-ఎన్‌సీపీ- కాంగ్రెస్ సంకీర్ణ స‌ర్కారులో అప్పుడే దోస్తీ బీటలు వారుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్లు, దానికి మిత్ర‌ప‌క్ష‌మైన శివ‌సేన ఇస్తున్న కౌంట‌ర్ల‌తో మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య ఏదో తేడా కొడుతోంద‌నే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్ బచావో పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రాహుల్‌తోపాటు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ...`నేను రాహుల్ సావర్కర్‌ను కాదు...రాహుల్ గాంధీని. ఎప్పటికీ సత్యమే మాట్లాడుతా. మరణించడానికైనా సిద్ధమేగానీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు` అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన ఘాటుగా స్పందించింది.

 

ర‌క్తం మ‌రిగిపోయే దారుణం...స్కూలు నుంచి పిలిపించి..సొంత బిడ్డ‌పై రేప్ చేసిన త‌ర్వాత‌

 

దేశంలో మహిళలపై వరుసగా లైంగికదాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత్ మేకిన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియాగా మారిందని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్రమోదీ, ఆయన అసిస్టెంట్ అమిత్ షా కలిసి నాశనం చేస్తున్నారు. వారే క్షమాపణ చెప్పాలి అని వ్యాఖ్యానించారు. వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అవమానించొద్దని ఈ వ్యాఖ్యలపై శివసేన కౌంట‌ర్ ఇచ్చింది. 

 

జ‌గ‌న్ సొంత జిల్లా రెడ్డి ఐపీఎస్‌పై వేటు...అమిత్‌షా ఆఫీసు సంచ‌ల‌న నిర్ణ‌యం

 

శివసేన త‌ర‌ఫున గలం వినిపించ‌డంలో ముందుండే ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కాంగ్రెస్ నేత రాహుల్ కామెంట్ల‌పై ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వినాయక్ దామోదర్ సావర్కార్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. సావర్కార్ కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్తు దేశానికి గర్వకారణమైన నాయకుడు. దేశానికి, ఆత్మ గౌరవానికి గర్వకారణమైన నేత. నెహ్రూ, గాంధీల మాదిరిగానే సావర్కార్ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు. అలాంటి వ్యక్తిని గౌరవించాల్సిందే’’ అంటూ తేల్చిచెప్పారు. కూట‌మి ఏర్ప‌డి నెల‌కూడా కాక‌ముందే..అప్పుడే విమ‌ర్శ‌లు-ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఈ రెండు పార్టీల దోస్తీపై సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: