కలెక్టర్లు, ఎస్సీలకు జగన్మోహన్ రెడ్డి  మంగళవారం వైరెటీగా విందు ఇవ్వబోతున్నారు. అందరినీ అమరావతికి రమ్మని పిలిచింది సమీక్షలకోసమే. అయితే ఈ సమీక్షలను ఈసారి కాస్త వైరెటీగా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారట. మామూలుగా అయితే కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలంటే దాదాపు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను పిలవటం చెప్పదలచుకున్న విషయాలను వివరించటం, జిల్లాల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవటమే అందరికీ తెలిసింది.

 

కానీ మంగళవారం నాటి సమీక్షలను  మాత్రం టేబుళ్ళవారీగా ఏర్పాటు చేస్తున్నారట.  ప్రతి టేబుల్ దగ్గర కలెక్టర్, ఎస్పీలుంటారు. అలాగే పోలీసుశాఖకు సంబంధించి ఆయా రీజియన్ల ఐజిలు, డిఐజిలు కూడా ఉంటారు. సరే ఎలాగూ డిజిపి ఉంటారు లేండి. ఇక ఐఏఎస్ అధికారుల విషయంలో అయితే కేవలం కలెక్టర్లు మాత్రమే ఉంటారని సమాచారం.

 

ప్రతి టేబుల్ దగ్గరకు జగనే వెళ్ళి వాళ్ళతో జిల్లాల వ్యవహారాలు సమీక్షిస్తారట. ఆ సమీక్షలోనే వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను కూడా వడ్డించేస్తారని తెలుస్తోంది. అంటే కార్పొరేట్ కంపెనీల తరహాలో లంచ్ మీటింగులన్నమాట. ఒకవైపు భోజనం చేస్తునే సమావేశం, సమీక్షలు కూడా జరిగిపోతాయి. భోజనంలోకి సౌత్, నార్తిండియన్ వంటలకాలను రెడీ చేస్తారని సమాచాం. ప్రత్యేకించి భోజనం తర్వాత సమావేశాలంటూ సమయాన్ని వృధా చేయటమన్నది కార్పొరేట్ కంపెనీల్లో ఎక్కడా ఉండదు. అదే పద్దతిని జగన్ కూడా ఫాలో అవుతున్నారు.

 

పనిలో పనిగా ప్రతి టేబుల్ దగ్గరకు జగనే స్వయంగా వెళ్ళి అందరితోను జిల్లాల వ్యవహారాలను సమీక్షించేస్తారన్నమాట.  కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలంటే మంత్రులు, ఎంఎల్ఏలు లేకుండా ఎలా ఉంటారు. అందుకనే వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. వాళ్ళు కూడా టేబుళ్ళవారీగానే కూర్చుంటారట. మంత్రులు, ప్రజాప్రతినిధుల సమస్యలను, పరిష్కారాలను కూడా కలెక్టర్లు, ఎస్పీల ఎదుటే మాట్లాడేస్తారు.

 

అందరినీ ఎదురుగానే పెట్టుకుని మాట్లాడుతారు కాబట్టి సమస్యలకు  పరిష్కారాలు కూడా అక్కడికక్కడే తేలిపోతుంది. ఇదివరకూ అయితే సమీక్షల పేరుతో ఐఏఎస్, ఐపిఎస్ లను  గంటలకొద్దీ చావగొట్టేవారు. ఎంఎల్ఏలను సమావేశాలకు పిలిచేవారు కాదు. కానీ ఇపుడు వాళ్ళని కూడా పిలవటంతో జిల్లాల సమస్యల వెంటనే పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. చూద్దాం కొత్త తరహా సమీక్షలు ఎంతవరకూ ఫలితాలనిస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: