పశ్చిమబెంగాల్ లో బరాక్ పూర్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ పై దాడి జరిగింది. కంకినారా నుండి ఆయన తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై ఇటుకలతో దాడి చేశారు. తర్వాత కారు దగ్గర్లో ఓ  బాంబు విసిరేశారు. ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బయటపడ్డారు. దీని పై స్పందించిన అర్జున్ సింగ్  తనపై తృణమూల్ కాంగ్రెస్ నేతలే దాడి చేశారని ఆరోపించారు. క్యాబ్ బిల్లు ఆమోదం తర్వాత పశ్చిమ బెంగాల్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల నేపథ్యంలోనే  ఎంపీ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు. ఆ తర్వాత కారుకి సమీపంలో బాంబు విసిరారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీ సేఫ్ గా బయటపడ్డారు. అర్జున్ సింగ్ బరాక్ పూర్ ఎంపీగా ఉన్నారు. ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ పాలన సాగిస్తున్నా ఆయనపై ఇటువంటి ఘటన జరగడం బాధాకరం. 

ఏదో పని మీద కారులో వెళ్తుండగా.. ఎంపీ వాహనాన్ని కొందరు దుండగులు అడ్డగించారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. దీనిపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన వారే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు. వెంటనే వెస్ట్ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీలకే భద్రత లేనప్పుడు సగటు మనిషి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: