కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఎన్నో గొడవలకు దారి తీస్తుంది. ప్రతిపక్షాల నిరసనల మధ్యనే లోక్ సభ,రాజ్యసభ రెండిటిలోనూ ఈ బిల్లును నెగ్గించుకున్న ప్రభుత్వం. ఆ తర్వాత రాష్ట్రపతి అనుమతితో ఈ బిల్లుకు చట్టం తీసుకొని వచ్చింది. కానీ ఈ పౌరసత్వ సవరణ బిల్లు వల్ల ఈశాన్య రాష్ట్రమైన అస్సాం గొడవలతో అట్టుడుకుతోంది. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ఉద్రిత క్షణాలు గడుపుతున్నారు. అక్కడ రైళ్లు, రైల్వేస్టేషన్లు తగలబెడుతున్నారు.

 

కానీ ఇప్పుడు ఈ నిరసన సెగలు దేశ రాజధాని ఢిల్లీ కి కూడా పాకాయి. ఈ రోజు సాయంత్రం దక్షిణ ఢిల్లీలో ఆందోళన కారులపై పోలీసులు లాఠీచార్జి జరపడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. ఈ గొడవలో పలువురికి గాయాలు అయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా నగర్లో పలువురు ఆందోళనకు దిగారు. ఎన్.ఎస్.యు.ఐ విద్యార్థి సంఘం నాయకుడు ఒకరు మేము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కావాలనే పోలీసులు మా పై లాఠీచార్జి చేశారని ఆరోపించాడు. అలాగే పోలీసులు తమపై భాష్పవాయువు ప్రయోగించారు అని చెప్పాడు.

 

మరో వైపు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మేము ఇటువంటి హింసలు చేపటము అని స్పష్టం చేశాయి. అక్కడ ఉన్న స్థానికుల ఇలాంటి గొడవలు చేశారని వారు చెప్పారు. ఢిల్లీ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కి సంబంధించిన మూడు బస్సులు ఆందోళనకారులు తగలబెట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు వెళుతున్న అగ్నిమాపక వాహనాన్ని కూడా వారు ధ్వంసం చేశారు.

 

ఈ సంఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది కూడా గాయాలయ్యాయి. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న నాలుగు మెట్రో స్టాప్ లో కూడా రైలు ఆపకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. మీరు నిరసన తెలపాలనికుంటే శాంతియుతంగా చేయండి. ఇలాంటి హింసాత్మక నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: