ముఖ్యమంత్రి జగన్ ఒక ధీమా... ముఖ్యమంత్రి జగన్ ఒక భరోసా.. ముఖ్యమంత్రి జగన్ ఒక నమ్మకం... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అనుకుంటున్న మాట ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనను గాడిలో పెట్టి  తనదైన స్టైల్ లో రాష్ట్రంలో పాలన అందిస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. తమకు ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే ధీమా  ప్రజల్లో కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్ పాలన వస్తే రాజన్న పాలన వస్తుంది అని నమ్మిన... ప్రజలందరికీ మరోసారి రాజన్న పాలన అంధిస్తూ నమ్మకాన్ని కలిగిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్. 

 

 

 

 ఇదిలా ఉండగా... తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఇంటర్వ్యూ కి హాజరు కాగా.. ఆయనకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఒకప్పటి వైయస్ రాజశేఖర్రెడ్డి పాలనకు నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ఉన్న పోలిక తేడా ఏంటి ఇంటర్వ్యూ లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అని ప్రశ్న ఎదురైంది . ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన సజ్జల రామకృష్ణా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన కు నేడు జగన్ మోహన్ రెడ్డి పాలన కు చాలా తేడా ఉందని... ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం జనరేషన్ చేంజ్ అని తెలిపారు. నేను ఉన్నట్టుగా మా అబ్బాయి ఉండడు  కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అందుకే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నట్లు ప్రస్తుతం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. 

 

 

 

 ఒకప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు... కాలం మారింది టెక్నాలజీ కూడా విపరీతంగా పెరిగిపోయింది అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. పబ్లిక్ లైఫ్ లో  నిఘా కూడా పెరిగింది అని  ఆయన తెలిపారు. ప్రస్తుతం యంగ్ జనరేషన్ వచ్చేసిందని వాల్ల ఆలోచన  చాలా అడ్వాన్సు గా ఉంది అని  వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆలోచనలు ఎంత  అడ్వాన్సు గా ఉన్నప్పటికీ బేసిక్ కోర్  సేమ్ గా ఉంది అంటూ ఆయన తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి  సొంతంగా పెట్టిన పార్టీ కావడంతో ఆయనకు ఇంకా ఎక్కువ పస్వచ్ఛ  ఉందని వాళ్ళ నాన్నగారికి లేని స్వేచ్ఛ కూడా  వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: