ప్రపంచంలో ఎక్కడో ఒక చోట భూకంపం వస్తూనే ఉంటుంది.  భూమిలో జరుగుతున్న అలజడి దీనికి ఒక కారణమైతే... వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా భూకంపాలకు కారణం అవుతుంటాయి.  జురాసిక్ యుగం చివరలో తీవ్రమైన భూకంపాలు వచ్చి డైనోసార్స్ అంతరించి పోవడానికి ఇదే కారణం అని పర్యావరణ వేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు.  

 


ఇక ఇదిలా ఉంటె, ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటి.  ఈ దేశంలో తరచుగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి.  తాజాగా ఈరోజు అక్కడ కొద్దిసేపటి క్రితమే భూకంపం వచ్చింది.  రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది.  పడోడా పట్టణంలో ఈ భూకంపం దాటికి చాలా ఇల్లు నేలమట్టంఅయ్యాయి .  దీంతో ప్రజలు భయబ్రాంతులకు లోనయ్యారు.  ప్రజలు రోడ్డుమీదకు పరుగులు తీశారు.  

 


అయితే, అదృష్ట వశాత్తు పెద్దగా ప్రాణనష్టం జరగలేదు.  కానీ, భవనాలు కూలిపోవడంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది.  ఇక ఈ నగరంలో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది.  పోలీసులు, సహాయక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.  అయితే, ఇక్కడ తరచుగా భూకంపాలు వస్తున్నా గతంలో  కాస్త తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగానే  కనిపిస్తోంది.  ఇలాంటి భూకంపాలు రావడం వలన సునామి వచ్చే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు.  అయితే, ఇప్పుడు వచ్చిన భూకంపం  కారణంగా భూకంపం వచ్చే అవకాశం లేదని అంటున్నారు.  

 


2004 డిసెంబర్ 26 వ తేదీన హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా ఎలాంటి వచ్చిన సునామి ధాటికి ప్రపంచంలోని దాదాపు 9 దేశాలు ఎంతగా ఇబ్బంది పడ్డాయో చెప్పక్కర్లేదు.  వేలమంది మరణించారు.  బిలియన్ డాలర్ల కొద్దీ నష్టం సంబంధించింది.  ముఖ్యంగా ఫిలిప్పీన్స్, జపాన్, శ్రీలంకలో సునామి వలన ఎక్కువగా ఇబ్బందులు వచ్చాయి.  ప్రజలు మరణించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: