జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. జొన్నల్లో ప్రొటీన్లే కాకుండా పాస్పరస్‌, మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, నేరేడు పండ్లలో వుండే యాంటీయాక్సిడెంట్ల కంటే జొన్నల్లో రెట్టింపు యాంటీ-యాక్సిడెంట్లు వుంటాయి. 

 

జొన్న ముద్ద, జొన్న అంబలి, జొన్న రొట్టెలను ఆహారంలో తీసుకుంటే.. గుండెజబ్బులు, కేన్సర్‌, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు. అంతే కాదు జొన్న ఇడ్లీ తీసుకున్న ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాంటి ఈ జొన్న ఇడ్లీని ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఆలాంటి వారు ఈ జొన్న ఇడ్లీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు...

 

ఉల్లిపాయలు - అర కప్పు, 

 

పచ్చిమిర్చి - 1, 

 

అల్లం - అరంగుళం, 

 

మిక్స్‌డ్‌ వెజిటెబుల్స్‌ - 1 కప్పు, 

 

జొన్నలు - అర కప్పు, 

 

నీళ్లు - ఒకటిన్నర కప్పు, 

 

ఉప్పు - తగినంత, 

 

నూనె - 2టే.స్పూన్లు, 

 

ఆవాలు - 1 టీస్పూను, 

 

మినప్పప్పు - 1 టీస్పూను, 

 

ఎండుమిర్చి - 1, 

 

కరివేపాకు - 1 రెమ్మ

 

తయారీ విధానం...

 

ఉల్లిపాయలు, అల్లం, కూరగాయలు అన్నిటినీ సన్నగా తరగాలి. ఆతర్వాత జొన్నలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. బాణీలో నూనె వేసి, మొదటగా ఆవాలు, ఆ తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి వేయించాలి. ఆ తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కూరగాయ ముక్కలు వేసి వేయించాలి. ముక్కలు కొద్దిగా ఉడికాక ఒకటిన్నర గ్లాసుల నీళ్లు పోసి తగినంత ఉప్పు వేయాలి. నీరు మరిగాక జొన్నలు వేసి చిన్న మంట మీద మెత్తబడేవరకూ ఉడికించాలి. అంతే.. రుచికరమైన, ఆరోగ్యవంతమైన  జొన్న ఇడ్లీలు రెడీ అయిపోతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: