దిశా హత్య కేసులో  నిందితులను ఎన్ కౌంటర్ చేసిన  విషయం అందరికి తెలిసిన విషయమే ఆ ఎన్ కౌంటర్ పట్ల యావత్ దేశమంతా హర్షం వ్యక్తం చేసారు. అలాగే దిశ కు చేసిన న్యాయం బాధితులందరికీ చేయాలనీ విజ్ఞప్తులు,  డిమాండ్ లు పలు సంచనాలకు దారితీసాయి.దిశ సంఘటన తదనంతరం  నిర్భయ కేసులో శిక్షను అనుభవిస్తున్న  నిందితులను తన చేతులతో ఉరి తీసే అవకాశం ఇవ్వాలంటూ అంతర్జాతీయ షూటర్‌ వర్తిక సింగ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు.

ఇది నా రక్తంతో రాస్తున్నా నిర్భయ హత్య కేసు నిందితులను నా చేతులతో ఉరి తీసే అవకాశం కల్పించండి. దీనిద్వారా దేశంలో ఒక మహిళ కూడా ఉరిశిక్షను అమలు చేయగలదనే సందేశాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నాని వేడుకున్నారు.2012 డిసెంబర్‌ 16న అతి కిరాతకరంగా అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన నిందితులు ప్రస్తుతం తీహార్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. త్వరలోనే వీరిని ఉరి తీయనున్న సంగతికూడా  తెలిసిందే.   వారిని ఉరి తీస్తున్నారన్న విషయం తెలిసినా కోపం తగ్గని వర్తిక సింగ్  తనకు వారిని ఉరి తీసే అవకాశం కల్పించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రక్తంతో లేఖను రాసింది.

నిర్భయ కేసులోని నిందితులకు ఉరిశిక్ష అమలు కావడం ఉరి తీయడానికి తాళ్లను కూడా సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వర్తిక మాటలు పలు సంచనలకు దారి తీసింది. నిర్భయ నిందితులను ఉరి తీయడానికి ఏర్పాటు చేసిన  తాళ్లను సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు  బీహార్‌లోని బుక్సర్‌ జైలు అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు.  అదే జైలు నుండే ఇంతకు ముందు పార్లమెంటుపై ఉగ్రదాడికి పాల్పడిన అఫ్జల్‌ గురు మరియు  కిల్లర్‌ ధనుంజయ్‌ చటర్జీ అదేవిదంగా  ముంబై పేలుళ్ల సూత్రధారి యాకుబ్‌ మీనన్‌,  అజ్మల్‌ కసబ్‌లను బుక్సర్‌ జైలు నుంచి తెప్పించిన తాళ్లతోనే ఉరి తీయడం గమనార్హం. ఇప్పుడు నిర్భయ బాదితులను కూడా అవే తాళ్లతో ఉరితీయడం తో పాటు వారిని ఉరితీసే అవకాశం ఇవ్వమనడం ఇవన్నీ సాధ్యం కాకపోయినా వారి కోపాన్ని అలా ప్రదర్శించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: