ఈ మధ్య జరిగిన ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డ విషయం మనకందరికీ తెలిసిన  విషయమే. ఆర్టీసీ కార్మికుల పిల్లలు కూడా సీఎం కెసిఆర్  ను మళ్ళీ విధుల్లోకి తీసుకోమని ప్రాధేయపడ్డారు అలాంటి సంఘటనే మళ్ళీ పునరావృతం అయింది ఒక  చిన్నారి వయసు కేవలం ఆరేళ్ళు తండ్రి అంటే ఆమెకు మహా ఇష్టం. కానీ ఆర్టీసీ కండక్టర్ కావడం వల్ల  ఆయనెప్పుడూ బాగా బీజీ గా ఉండేవాడు.

మహారాష్ట్రలోని ఒక  డిపోలో బస్ కండక్టర్‌ గా పని చేస్తున్న తండ్రి నెలసరి జీతం సరిపోక ఓవర్ టైం చేసే తండ్రి   నెలలో అనేక సార్లు ఓవర్‌టైం చేసేవారు. దీంతో కన్న కూతురికి ఆయన ఎక్కువ సమయం కేటాయించలేకపోయేవారు. చేతికొచ్చే జీతం ఖర్చులకు చాలకపోవడంతో అదనపు సంపాదన కోసం ఆయన ఓవర్‌లైం చేసేవారు. కానీ వారం  మొత్తంలో ఒకటి రెండు సార్లు తప్ప తండ్రిని చూడలేకపోవడంతో అతడితో మాట్లాడే సమయం గాని ఆడుకునే సమయం లేకపోవడం తో  ఆ చిన్నారి మనసు కలత చెందింది. జీతం పెరిగితే తండ్రి ఓవర్‌టైం మానేసి తనతో ఎక్కువ సమయం గడుపుతారని భావించి ఏకంగా మహారాష్ట్ర సీఎంకు  లేఖ రాసింది.

సార్ మ నాన్న రోజులో ఎక్కువ సమయం తన ఉద్యోగం నిమిత్తం పనిలోనే గడుపుతున్నాడు  ఇంట్లో ఉండట్లేదు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం కానీ  ఆయన లేకపోవడంతో నేను ఆయనతో గడపలేక పోతున్నాను మరియు  చదవలేకపోతున్నాను. మా స్నేహితురాలు తండ్రి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు రోజు సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి తనతో గడపడం,  ఆడుకోవడం చేస్తుంది కానీ నాకు ఆ పరిస్థితి లేదు కావున  మీరు గనుక జీతం పెంచితే ఆయన నాతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది అని సీఎం కు ఓ లేఖ రాసింది. కాగా కూతురి లేఖ విషయాన్ని తండ్రి మీడియాతో పంచుకున్నారు. సీఎంకు లేఖ రాసానని మా అమ్మాయి నా చేతిలో ఓ ఉత్తరం పెట్టింది.

  మేము పనిలో పెట్టిన శ్రద్ధ కుటుంబం పైన పెట్టడం లేక నా కూతురు లేఖ రాసి నన్నే పోస్ట్ చేయమని చెప్పింది. దీంతో నేనే ఆర్డినరీ పోస్ట్‌లో ఉత్తరాన్ని పంపించాను. మరి సీఎందాకా ఈ ఉత్తరం వెళుతుందో లేదో తెలియదు అని తండ్రి మీడియా ప్రతినిధులతో అన్నారు. కనీసం మా పిల్లల పరిస్థితి అయినా అర్ధం చేసుకొని జీతాలు పెంచితే బాగుంటుందని సర్కార్ కి విజ్ఞప్తి చేసాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: