ఎప్పుడు ఏదొక వివాదంలో ఉంటె తప్ప ఆయనకు నిద్ర రాదు.. ముద్ద దిగదు. అలాంటి వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఎప్పుడు ఏదోక వివాదంలో మునిగి తేలే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మొన్న ఈ మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ సీనియర్ ఎన్టీఆర్ బయో పిక్ అని వివాదాలకు గురైన రామ్ గోపాల్ వర్మ ఇటీవలే మరో చిత్రంతో వివాదంలోకి ఎంటర్ అయ్యాడు. 

            

అదే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. సారీ సారీ.. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం. ప్రస్తుత రాజకీయాలపై అంటూ ఈ సినిమా తీసాడు. అయితే ఈ సినిమా ఎన్నో వివాదాల మధ్య ఈ నెల 12 వ తేదీన విడుదల అయ్యింది. విడుదలకు ముందు వివాదమే.. విడుదల తర్వాత వివాదమే ఈ సినిమా. 

               

నిన్నటికి నిన్న జన సైనికులు... రామ్ గోపాల్ వర్మ అనుకోకుండా మరణించడానికి పెద్ద వాల్ పోస్టర్ ని రెడీ చేయించి ట్విట్టర్ లో పెట్టి సంచలనం చేశారు. నిన్న అంత ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇప్పుడు తాజాగా మళ్ళి రామ్ గోపాల్ వర్మ ట్రెండ్ అవుతున్నాడు. 

 

అదేంటంటే.. సైబర్‌క్రైమ్‌ పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. రేపు (సోమవారం) సైబర్‌ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఫిర్యాదుతో వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’' సినిమాలో తన ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి వాడారని పాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి రామ్ గోపాల్ వర్మ హాజరు అవుతారా ? లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: