మరోసారి ఫిలిప్పీన్స్‌ లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఆదివారం భారీ భూంకంప సంభవించింది. ఈ సంఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందారు. ఇంకా  100 మందికి పైగా ఇక్కడ గాయపడ్డారు. ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలోని మిండనావ్ ద్వీపంలో ఈ భూకంపం వచ్చిందని అధికారులు నివేదిక వెల్లడించారు. దక్షిణ భాగంలో పెద్ద నగరమైన దావావోకు 90 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రిక్టార్ స్కేలు పై దీని తీవ్రత 6.8 గా నమోదు అయింది. అయితే, సునామీ వచ్చే సూచనలు ఏమి  లేవని యూఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేశారు. ప్రకంపనల ధాటికి పడాడా నగరం భారీగా దెబ్బ తినింది. నగరంలో అనేక భవనాలకు బీటలు వారాయి.

 

ఈ భూకంప సమయంలో ఒక ఇంట్లో ఉండిపోయిన చిన్నారి భవనం కూలిపోవడంతో మృతి చెందిందని ప్రావిన్స్ గవర్నర్ డగ్లస్ కాగాస్ తెలియ చేశారు. ప్రకంపనలు ఆగిన అనంతరం ఆ చిన్నారి మృతదేహాన్ని సహాయక బృందాలు బయటికి తీసుక వచ్చారు. పడాడాలోని ఒక మార్కెట్లో భవనం కూలి ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వివరాలు తెలిపారు. భూకంపంతో నగరంలోని ఆస్పత్రుల నుంచి రోగులను బయటికి తెచ్చేందుకు సహాయక బృందాలు, అధికారులు బాగా కష్ట పడ్డారు. పలు షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లోని ప్రజలు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు పెట్టారు.

 

ఇక భూ ప్రకంపనాల కారణంగా కూలిపోయిన భవనాల కింద ఉన్నవారిని అధికారులు కాపాడేందుకు వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. దేశాధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే కూడా భూకంపంలో చిక్కుకున్నారని, అయితే ఆయనకు ఏమి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దీవుల సముదాయమైన ఫిలిప్పీన్స్‌ లో చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. కానీ ఇవి రిక్టార్ స్కేలు పై వీటి తీవ్రత ఎక్కవుగా ఉండకపోవడం వల్ల ప్రశాంతంగా జీవిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: