ఇటీవలే కాలంలో రోడ్డు యాక్సిడెంట్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలం అయితే మరి దారుణంగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ పై నుండి కారు పడి మహిళా అక్కడికక్కడే మృతి చెందింది. ఇంకా ఇలాంటి దుర్ఘటనలు చాలానే జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోను ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది.  

                                

ఇలా ఎక్కడపడితే అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా నేపాల్ లోను ఇలాంటి ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు వస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడగా 14 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.  

                           

నేపాల్‌లోని సింధుపాల్ చౌక్‌లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింధుపాల్ చౌక్ జిల్లాలోని కాలిన్‌చౌక్ మందిరాన్ని దర్శించుకుని ఆదివారం ఈరోజు ఉదయం 40 మంది యాత్రికులతో ఓ బస్సు బయల్దేరింది. డోలాఖా ఖాదీచౌర్ జిరి రోడ్డు మార్గంలో బస్సు అదుపు తప్పి 500 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. 

                     

ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు చురుగ్గా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. అయితే వెంటనే రంగంలో దిగిన పోలీసులు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి సహాయ చర్యలు చేపడుతున్నారు. క్షేతగాత్రులకు దగ్గర లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్లు ఎప్పుడు అదుపులోకి వస్తాయో తెలియటం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: