వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన దగ్గర నుంచి వినూత్న ఆలోచనలతో దూసుకెళ్తూ, పాలనలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ 1400 కోట్లను ఆదా చేసాం అని మంత్రి అనిల్ కుమార్ అసెంబ్లీలో చెప్పారు. ఇక ఆరోగ్య శ్రీ లోనూ రూ 1000 దాటిన అన్ని శస్త్ర చికిత్సలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తాయంటూ పేర్కొన్నారు.

 

ఇక తాజాగా ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య  సమన్వయం పెంచేందుకు విందు ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఈ విందు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరిగాయి. ప్రతిపక్ష టీడీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేస్తుండగా, అధికార పార్టీ మాత్రం డిసెంబర్ 17 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఆరోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం విందు ఏర్పాటు చేయనున్నారు. 

 

ఈ విందులో భాగంగా ఏపీ లోని 13 జిల్లాలకు 13 టేబుళ్ళు ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్ కు సంబంధిత జిల్లాకు చెందిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్యెల్యేలను విందులో భాగస్వామ్యం చేయనున్నారు. ఇక సీఎం జగన్ స్వయంగా ప్రతీ టేబుల్ దగ్గరకు వెళ్లి ఆ జిల్లాకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోనున్నారు. ఇలా ప్రతీ టేబుల్ దగ్గర సీఎం 10 నిమిషాల పాటు సమయం వెచ్చించనున్నట్లు సమాచారం. విందు అనంతరం తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమం జనవరి నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటిస్తారని సమాచారం. ఇక ఇక్కడే రచ్చబండ రూట్ మ్యాప్ కూడా విడుదల చేస్తారని సమాచారం. ఏది ఏమైనా జగన్ తన వినూత్న ఆలోచనలతో దూసుకెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: