డయాబెటిస్.. భారత్ లో రోజు రోజుకు డయాబెటిస్ వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ డయాబెటిస్ వల్ల ప్రాణానికి ఏ ముప్పు లేకపోయినప్పటికీ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే డయాబెటిస్ కంట్రోల్ అవ్వవాలంటే చాలా కష్టం. అలాంటి ఈ డయాబెటిస్ కు చెక్ పెట్టె చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.. ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

                                                    

డయాబెటిస్ ఉంటే తీపి పదార్థాలు తినకూడదు.. నిజమే.. అయితే, డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు ఉప్పు ఎక్కువగా తీసుకున్నా ముప్పేనంట. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల టైప్‌-2 మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయని యూకేకు చెందిన వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

                                                                

అంతేకాకుండా రక్తపోటు వచ్చే ప్రమాదం ఉన్నందున వీలైనంత వరకు ఉప్పు వాడకాన్ని తగ్గించాలని ఆ వైద్యులు సూచిస్తున్నారు. రోజులో టేబుల్‌ స్పూన్‌కు మించి ఉప్పు తీసుకోకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు గాను డయాబెటిస్ వచ్చింది అంటే.. చక్కర తినకూడదు.. ఉప్పు తినకూడదు.. ఇంకొద్ది రోజులు పోతే డయాబెటిస్ ఉన్నవారు ఆహారాన్ని తీసుకోకండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పిన చెప్తారు. అందుకే డయాబెటిస్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: