కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లోని షాద్ నగర్ ప్రాంతం వద్ద గల తొండుపల్లి టోల్ గేట్ ఏరియలో ఘోరంగా రేప్ కు గురి కావడంతో పాటు హత్య గావింపబడ్డ లేడీ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనను ఇప్పటికీ కూడా మన దేశ ప్రజలు మరిచిపోలేదు అనే చెప్పాలి. నలుగురు దుర్మార్గులు ఎంతో చాకచక్యంగా మాయమాటలతో ఆమెను నమ్మించి, అనంతరం ఆమెను ఈడ్చుకెళ్లి అత్యంత కిరాతకంగా రేప్ చేసి, ఆపై ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణాన్ని దేశంలోని ప్రజలు సహా పలువురు సినీ, 

 

రాజకీయ ప్రముఖులు సైతం తీవ్రంగా ఖండించడం జరిగింది. కాగా ఘటన జరిగిన పది రోజులోపే నిందితులను పోలీసులు సీన్ రి కన్స్ట్రక్షన్ కోసం ప్రియాంకను కాల్చేసిన చోటికి తీసుకెళ్లగా, హఠాత్తుగా నిందితులు నలుగురూ కూడా పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోవడానికి ప్రయత్నించడంతో వారిపై వెంటనే పోలీసులు కాల్పులు జరుపగా, ఆ నలుగురు నీచులూ కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. కాగా ఆ ఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నేటి యువత మద్యం, మితిమీరిన పోర్నోగ్రఫీ వంటి వాటి వలన పెడ త్రోవ పడుతూ, అమాయకమైన అమ్మాయిలపై ఈ విధంగా దారుణాలకు దిగుతున్నారని పలువురు మహిళా సంఘాల వారు అభిప్రాయపడుతున్నారు. 

 

అలానే ప్రభుత్వాలు కూడా ఇటువంటి ఘటనలపై శిక్షలు ఎంతో కఠినంగా అమలు చేస్తే, రాబోయే రోజుల్లో ఇటువంటి పనులు చేయడానికి ప్రజలు భయపడతారని వారు అంటున్నారు. ఇక దిశా కేసుకు సంబంధించి ఇటీవల ఫోరెన్సిక్ బృందం వారు సమర్పించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ని బట్టి ఆమె లివర్ లో ఆల్కహాల్ అవశేషాలు ఉన్నాయని, అలానే ఆమె ఒంటి పై కొద్దిపాటి గాయాలు కూడా ఉన్నాయని సమాచారం. అయితే ఆమెను నిందితులు తగులబెట్టిన సమయంలో ఆమె బ్రతికే ఉందా, లేదా అనే దానిపై కూడా ఫోరెన్సిక్ బృందం నివేదిక అందించిందని, అతి త్వరలో అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయని తెలుస్తోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: