కొందరు ఆడవాళ్లు సమాజంలో గాని, వారి ఇంట్లో గాని ఉండే తీరు చూస్తే సిగ్గుగా అనిపిస్తుంది. ఇక కొందరు మహిళలు ఎంత అసహ్యంగా ప్రవర్తిసారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఇక కొందరు పొట్టకూటికోసం చేయరాని పనులు చేస్తుంటారు. ఇదే కోవలోకి చెందిన ఓ మోడల్‌కు దొంగతో ఎదురైన అనుభవం చాలా చిత్రంగా ఉంది. అదేమంటే అడల్ట్ వీడియోలు చేస్తూ, క్లబ్బుల్లో పనిచేసే డేనీ అనే అమెరికాకు చెందిన మోడల్ జార్జియాలోని తన ఇంట్లో నగ్నంగా నిద్రపోయే అలవాటు ఉందట. ఆ అలవాటు వల్ల తానొక సమస్యను ఎదుర్కొందట.

 

 

తాను ఇంట్లో ఒంటరిగా నగ్నంగా నిదురించే వేళ అర్ద రాత్రి సమయంలో ఎవరో తలుపులు చప్పుడు చేసినట్లుగా పెద్ద చప్పుడయింది. ఆ శబ్దానికి  ఆమె పెంపుడు కుక్క పెద్దగా అరవడం ప్రారంభించింది. ఆ చప్పుళ్లకు మేలుకొన్న ఆమె.. నెమ్మదిగా లేచి బెడ్రూం నుంచి ముందు గదిలోకి వచ్చి తలుపు తీయగా. అక్కడ చేతిలో హ్యాండ్‌గన్‌తో నిలబడిన దొంగ కనిపించాడు. అతన్ని చూసిన డేనీ భయంతో వణికిపోయింది. నగ్నంగా తన ముందుకొచ్చిన ఆమెను చూసిన ఆ దుండగుడు ఎలాంటి ఉద్రేకానికి లోనుకాకుండా తుపాకీ ఆమె వైపు గురిపెట్టి ఇంట్లోని లాకర్ తెరవాలని బెదిరించాడు.

 

 

ఆ లాకర్‌లో ఏమీ లేవని, అంతా ఖాళీ అని డేనీ చెప్పినా నమ్మని ఆ దొంగ ఓపెన్ చేసిన ఆ లాకర్ ఖాళీగా ఉండటం చూసి కోపంతో ఆమెను మంచంపై పడేశాడు. ఆమె తిరిగి లేచేలోగా పారిపోయాడు. అతను వెళ్లిపోయిన వెంటనే డేనీ పోలీసులకు ఫోన్ చేసింది. ఇదంతా ఆ ఇంట్లోని ఓ కెమెరాలో రికార్డయింది. అయితే ఆ రికార్డులో డేనీగానీ, ఆ దుండగుడుగానీ మొహాలు కనిపించడంలేదు.

 

 

ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఇదంతా డేనీ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేశారు. అయితే ఆ వీడియో తీసిన కెమెరా తన పెంపుడు కుక్కను గమనించడానికి పెట్టిన ‘డాగ్ కెమెరా’ అని అందువల్లే అది కిందివైపుకు మాత్రమే చూస్తోందని డేనీ వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జార్జియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: