జాతీయ పౌరసత్వం బిల్లు ఎప్పుడైతే చట్టసభల్లో ఆమోదం పొందిందో అప్పటి నుంచి దేశంలో అలజడి మొదలైంది.  అప్పటి వరకు దేశంలో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులను ఇండియా నుంచి పంపించేస్తారేమో అనే భయం పట్టుకుంది.  ముఖ్యంగా ఇండియాకు పాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి ఎక్కువమంది వలసలు వచ్చారు.  దేశంలో అక్రమంగా నివసిస్తున్నారు.  బోర్డర్ లో ఉండే రాష్ట్రాలు వారికీ ఆశ్రమం కల్పిస్తున్నాయి.  


ఫలితంగా వారు దేశంలో కొన్ని అరాచకాలు సృష్టిస్తున్నారు.  ముస్లిం దేశాల్లో అక్కడ ముస్లింలు మైనారిటీలు కానప్పుడు ఎందుకు ఇండియా రావాలి.  ఇక్కడ మైనారిటీలుగా ఎందుకు ఉండాలి అన్నది కేంద్రం వాదన.  అందుకే అందుకు మూడు దేశాల నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ నివసిస్తున్న ముస్లింలను గుర్తించి వారిని వారి దేశాలకు పంపే ఏర్పాట్లు చేయాలన్నది ప్రభుత్వం డిమాండ్.  


అయితే, కాంగ్రెస్ పాలిట రాష్ట్రాలు, బెంగాల్ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేందుకు ససేమిరా అంటోంది.  కానీ, కేంద్రం మాత్రం చట్టాన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాలని, నో చెప్పే అధికారం రాష్ట్రాలకు లేదని స్పష్టంగా చెప్పింది.  దీంతో ఇప్పుడు అన్ని రాష్ట్రాలు జాతీయ పౌరసత్వం బిల్లును అమలు  చేయాల్సి వస్తోంది.  అమలు చేయకుంటే చర్యలు తప్పవని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.  


దీంతో దేశంలో అలజడి మొదలైంది.  ఈశాన్య రాష్ట్రాల్లో మొదట అల్లర్లు మొదలయ్యాయి.  అయితే, అక్కడ అల్లర్లు తగ్గుముఖం పట్టాయి.  ప్రభుత్వం అక్కడి వాళ్లకు సర్ది చెప్పింది.  బిల్లు ఉపయోగం గురించి చెప్పడంతో అలజడులు తగ్గాయి.  ఇక ఢిల్లీలో విశ్వవిద్యాలయ విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి రగడ చేస్తున్నారు.  ముఖ్యంగా జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్ లోని మను విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్  యూనివర్సిటీ వద్ద పెద్ద ఎత్తున చేరుకొని నిరసనలు తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: