భారత్ తో బలమైన మైత్రిని కొనసాగిస్తున్న దేశాల్లో బంగ్లాదేశ్ ఒకటి.  ఇండియాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ వస్తున్నది. బంగ్లాదేశ్ ఏర్పాటు చేసే విషయంలో ఇండియా ఎంతగానో సహకరించింది.  అప్పటి నుంచి ఇండియా అంటే బంగ్లాదేశ్ కు ఒక గౌరవం ఉంటున్నది.  అయితే, బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత ఆ దేశం నుంచి ఇండియాలోకి అక్రమంగా వలస వస్తున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది.  


ఇలా అక్రమ చొరబాట్ల కారణంగా దేశంలో జనాభా పెరిగిపోతున్నది.  దీనిని అరికట్టడానికి మొదట దేశంలోని అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్న వ్యక్తులను గుర్తించేందుకు జాతీయ పౌరసత్వం బిల్లును తీసుకొచ్చింది కేంద్రం.  దీనికి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకతను తెలుపుతున్నాయి. కారణం ఓటు బ్యాంకు.  


బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా వచ్చిన ప్రజలు బెంగాల్ లో నివాసం ఉంటున్నారు.  మమత ప్రభుత్వం అక్కడ వాళ్లకు  అనుకూలంగా ఉంటూ వాళ్లకు గుర్తింపు కార్డులు ఇస్తున్నది.  ఈ కార్డుల కారణంగా వాళ్ళు అన్ని సౌకర్యాలు పొందుతున్నారు.  దీంతో వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది.  తగ్గడం లేదు.  బోర్డర్ లో ఎంత కాపలా ఉన్నా ఏదోలా చొరబాట్లు జరుగుతూనే ఉన్నాయి.  


ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు బిల్లును తీసుకొచ్చారు కాబట్టి ఈ బిల్లు ప్రకారం అక్రమంగా చొరబాటు దారులను గుర్తించి వారికి సంబంధించిన జాబితాను ప్రభుత్వం తయారు చేయబోతున్నది.  ఇప్పటికే బంగ్లాదేశ్ ఈ లిస్ట్ ను కోరింది.  ఇండియాలో అక్రమంగా నివసిస్తున్న తమ దేశ పౌరుల లిస్టును ఇవ్వాలని, అలా లిస్ట్ ఇస్తే వారిని తిరిగి తమ దేశం తీసుకెళ్తామని అంటోంది బంగ్లాదేశ్.  మరి ఈ విషయంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లు ఎంతవరకు సపోర్ట్ చేస్తాయో చూడాలి. ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకు సపోర్ట్ చేస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  అయితే, పాకిస్తాన్ విషయమే తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: