చిత్తూరు జిల్లా టిడిపి రాజకీయాల్లో కీలకమైన మార్పులు వస్తున్నాయి. ఇక్కడ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పొలిటికల్ రీఎంట్రీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆమె మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన కాకముందు వరకు ఆమె కాంగ్రెస్ పార్టీలో కీలక సభ్యురాలిగా ఉండేవారు. కానీ ఆ తర్వాత 2014లో ఆమె టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

 

ఆ ఎన్నికల్లో టిడిపి తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేశారు కానీ ఆమె ఆ ఎన్నికలలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కేవలం తమ వ్యాపారాల మీద దృష్టి పెట్టారు. ఈమె దివంగత మాజీ పార్లమెంటు సభ్యుడు - సామాజిక కార్యకర్త పటూరి రాజ గోపాల నాయుడు కుమార్తెగా రాజకీయాల్లోకి ఆమె అడుగుపెట్టి చిత్తూరు జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు టిడిపి ఎంపీ గా పనిచేస్తున్నారు. కుటుంబంలో ఒకరు రాజకీయంగా పట్టు సాధించడంతో ఆమె సడలిపోయింది అని చెప్పారు. కానీ అరుణకుమారి తిరిగి చంద్రగిరి నియోజకవర్గంలో తిరిగి పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

 

ఈమెకు రాజకీయ ఓటు బ్యాంకు కాకుండా ఆమెకి వ్యాపారాల తరపు ఓటు బ్యాంకు కూడా ఉంది. 2014 ఎన్నికల తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడంతో చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలను పులివర్తి నాని కి అప్పగించారు. కానీ ఇప్పుడు గల్లా ఫ్యామిలీ తిరిగి రావడంతో టిడిపి వారికి ప్రాధాన్యత ఇచ్చింది.

 

ప్రస్తుతం ఎంపీగా ఉన్న జయదేవ్ తో పాటు గల్లా అరుణ కుమారి కూడా పొలిట్ బ్యూరో లో ఛాన్స్ ఇచ్చారు టిడిపి. దీంతో రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించనున్న గల్లా అరుణ కుమారి రాకతో టిడిపి చిత్తూరు జిల్లా టిడిపి రాజకీయాల్లో కీలకమైన మార్పులు రానున్నాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: