దేశంలో ఇప్పుడు ఏవి ముట్టుకున్నా షాక్ కొడుతున్నాయి.  అన్నింటి కంటే ముఖ్యంగా ఉల్లి ధరలు.  ఉల్లి ధరలు ఆకాశానికి తాకడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  ఉల్లి కొనడం కంటే తినకుండా ఉండటమే మంచిది అనే ఆలోచనకు వచ్చారు ప్రజలు.  అందుకే ఉల్లిని తినకుండా పక్కన పెడుతున్నారు.  ఉల్లిని కొనుగోలు చేయడం కంటే దానికి ప్రత్యామ్నాయంగా వేరే వస్తువులను కొనుగోలు చేస్తే బాగుంటుందని ఆలోచనకు వచ్చారు.  


అందుకే ఉల్లిని పక్కన పెట్టి మిగతా వాటిని కొనుగోలు చేస్తున్నారు.  ఇదిలా ఉంటె, ఉల్లి తరువాత బంగారం, పెట్రోల్ ధరలు నిత్యం పెరుగుతూ తగ్గుతూ వస్తుంటాయి.  ఈ రెండు ధరలు పెరిగినా, తగ్గినా కొనుగోలు చేయక తప్పదు.  ముఖ్యంగా పెట్రోల్.  పెట్రోల్ ధరలు పెరగడం వలన ఇబ్బందులు వచ్చినా.. కొనుగోలు చేయక తప్పడం లేదు. రవాణా చేయాలి అంటే పెట్రోల్ కొనుగోలు చేయాల్సిందే.  


ఇక ఇదిలా ఉంటె, ప్రతి మనిషికి నిత్యం అవసరమైన వాటిల్లో పాలు ముఖ్యమైనవి.  ఇప్పుడు ఎవరూ కూడా ఫామ్ కు వెళ్లి పాలు తెచ్చుకోవడం లేదు. పాల పాకెట్ల ద్వారానే పాలు కొనుగోలు చేస్తున్నారు.  ఇందులో భాగంగానే పాల వ్యాపారం జరుగుతున్నది.  దేశంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పాల ఫామ్ ను నడుస్తున్నాయి.  విజయ డైరీ, మదర్ డైరీ ఇలా కొన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.  


అయితే, ఇప్పుడు విజయ డైరీకి చెందిన పాలను లీటర్ పై రెండు రూపాయలు పెంచారు.  లీటర్ పాలు రూ. 42  గా ఉంటె, ఇది రెండు రూపాయలు పెరిగి రూ. 44 కి చేరుకుంది.  రెండు రూపాయలు పెంచడం వలన ప్రజలు, పిల్లలు ఇబ్బందులు పడతారని, ప్రజా సంఘాలు అంటున్నాయి.  తల్లిపాలు లేక పోతపాలకు అలవాటు పడిన పిల్లలకు ఈ పాలు కూడా దొరక్కపోతే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు.  తప్పనిసరి పరిస్థితుల్లోనే రెండు రూపాయలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు విజయ డైరీ యాజమాన్యం చెప్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: