అసెంబ్లీ సమావేశాలకు ఇంకా రెండు రోజులు మాత్రమే జరగబోతున్నాయి.  సోమ, మంగళవారం దాటితే అసెంబ్లీ నిరవధిక వాయిదా పడుతుంది.  వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు ఆగాలి.  అప్పటివరకు అసెంబ్లీ ఉండదు.  ఇక అసెంబ్లీ పాస్ కావాల్సిన బిల్లులు బోలెడు ఉన్నాయి.  నియోజక వర్గాల సమస్యలపై మాట్లాడాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు.  


వారంతా మాట్లాడే అవకాశం ఈ సమావేశాల్లో ఉంటుందా అన్నది డౌట్ గా ఉన్నది.  ఎందుకంటే, గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమావేశాల్లో సభలో జరిగిన గందరగోళం గురించి చూస్తుంటే మనకు  అవుతుంది.  సభలో రగడ తప్పింది సమస్యలపై మాట్లాడిన అంశాలు చాలా తక్కువ.  దిశ యాక్ట్ బిల్లు మాత్రం పాస్ అయ్యింది.  అయితే, ఇప్పుడు 13 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.  


ఈ 13 బిల్లులు ఈ రెండు రోజుల సమావేశాల్లో పూర్తి ప్రవేశపెట్టి ఆమోధింపజేయాలి.  అన్ని కూడా ముఖ్యమైన బిల్లులే.  ఈ బిల్లులు ఎప్పుడు ప్రవేశపెడతారో వాటిపై ఎప్పుడు చర్చిస్తారో చూడాలి.  రేపటితో సమావేశాలు ముగుస్తాయి కాబట్టి, ఎలాగైనా ఈరోజు నుంచి బిల్లుల పాస్ చేయడంపైనే సభ దృష్టిపెడతారని అంటున్నారు.  మిగతా విషయాలను పక్కన పెట్టి వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టె అవకాశం ఉన్నది.  


ఇక ఇదిలా ఉంటె, ప్రతి పక్షం మాత్రం కొన్ని కీలక విషయాలను ఈ రెండు రోజుల్లో సభ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యొచ్చు.  ఒకవేళ సభలో ప్రతిపక్షం కీలకమైన ప్రశ్నలు సందిస్తే... దానికి సమాధానం ఇవ్వడంతో సభ సమయం పూర్తవుతుంది.  అలా కాకూండా ప్రశ్నలు, సమాధానాలు పక్కన పెట్టి బిల్లులు పాస్ అయ్యేలా మొదట చూస్తారని అంటున్నారు.  మరి సభను స్పీకర్ ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి. ప్రతిపక్షాలను ఈ విషయంలో స్పీకర్ కంట్రోల్ చేస్తూ బిల్లులు పాస్ అయ్యేలా చూడాల్సి ఉంటుంది.  సభలో వైకాపాకు మెజారిటీ ఉన్నది కాబట్టి అదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: