నిత్యావసర ధరల్లో ఒక్కొక్క వస్తువులకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన బస్సు చార్జీల వల్ల సామాన్యుల నెత్తిన అధికభారం పడుతుండగా తాజాగా పాల ధరల పెంపు వల్ల పేద, మధ్యతరగతి ప్రజల పైనా తెలియకుండానే వారి బడ్జెట్‌లో మార్పులు జరుగనున్నాయి. ఇప్పటికే ఉల్లి ధరలు బాంబుల్లా పేలుతుంటే వంటింట్లోకి రావడమే మానేసాయి. చాల మంది ఉల్లి వాడకం తగ్గించేశారు.

 

 

ఇదిలా ఉండగా ఇప్పుడు పాలధరల పెంపు వల్ల పాలు తాగే పిల్లల నుండి, గొంతులో వేడి వేడి తేనీరు పడితే గాని కదలలేని సామాన్యునికి ఇదొక షాకింగ్ న్యూసే. ప్రభుత్వాలు ఉన్నవి సామాన్యుల కన్నీరు తుడవడానికే గాని వారి కంట్లో కన్నీరు తేవడానికి కాదు. ప్రజల బాగోగులు పట్టించుకోని పాలనలో పేద వాడు మరింత పేద వాడు అవుతుంటే ఉన్న వాడు మాత్రం ఇంకా ఉన్నోడు అవుతూ, అన్ని రకాల పదార్ధాలతో కడుపు నిండా తిని కంటినిండా నిదురిస్తున్నాడు..

 

 

ఇక ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో విజయ పాలధరలు పెరిగాయ్. ఈ పెరిగిన ధరలు సోమవారం నుంచి అనగా 16 వ తారీఖు నుండి అమలు కానున్నాయి.. ఇక లీటరుకు రూ.2 చొప్పున పాలధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్టాండర్డ్ మిల్క్, హోల్ మిల్క్ ధరల్లో మార్పు లేదని యాజమాన్యం పేర్కొంది. పెరిగిన పాల ధరల నేథ్యంలో వెండర్ మార్జిన్‌ను లీటర్‌కు 25 పైసలు, బేస్ మార్జిన్‌ను రూ. 3.25 పైసలు పెంచినట్లు టీఎస్‌డీడీసీఎఫ్ జనరల్ మేనేజర్ తెలిపారు.

 

 

ప్రస్తుతం టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.42కు లభిస్తుండగా.. సోమవారం నుంచి మార్కెట్లో రూ.44కు లభించనుంది. ఇదే కాకుండా అమూల్ మిల్క్ కూడా అహ్మదాబాద్, సౌరాష్ట్ర, ఢిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో డిసెంబర్ 15 నుంచి లీటర్ పాలకు రూ.2 చొప్పున పెంచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో లీటర్ పాలకు రూ.3 చొప్పున ధర పెంచుతూ మదర్ డెయిరీ నిర్ణయం తీసుకుంది.

 

 

ఇదిలా ఉండగా  బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు, పెంచిన విజయ పాల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని పిల్లలకు దొరికే ఏకైక పౌష్టికాహారం పాలేనని, తల్లిపాలు అందుబాటులో లేని పసికందులు పోతపాల మీద ఆధార పడుతున్నారని పాల ధరలను పెంచితే పేద, మధ్య తరగతి పిల్లలు పాలకు దూరం అవుతారని పేర్కొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: