ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరో రెండు రోజులు మాత్రమే కొనసాగనున్నాయి . ఇప్పటికే వారం రోజులపాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల వాగ్వాదం , ఆరోపణలు, ప్రత్యారోపణలు , విమర్శలు , ప్రతి విమర్శలకే పరిమితయ్యాయి . నువ్వు ఒక్కటంటే ... నేను రెండు అంటా… అన్నట్లు అధికార , ప్రతిపక్ష పార్టీల సభ్యులు సభ లో వ్యవహరిస్తున్నారు . సభలో ప్రజాసమస్యలపై చర్చించడానికి అధికార పార్టీ సిద్ధంగా లేదని ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఆరోపిస్తుండగా , అసలు ప్రజాసమస్యలపై చర్చించడానికి ప్రతిపక్షానికి చిత్తశుద్దే  లేదని  ప్రభుత్వ చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు .

 

 ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సభ ను తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు . సభలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తున్న ఏదోరకంగా సభను సాగకుండా అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు . అయితే ప్రజాసమస్యలపై చర్చించకుండా , కేవలం తమ నాయకుడ్ని లక్ష్యంగా చేసుకుని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ సభ్యులు విరుచుకుపడుతున్నారు . అయితే ఇప్పటికే వారం రోజులు సభాసమావేశాలు జరిగినా, ఒక్క బిల్లులు పాస్ కాకపోవడంతో , ఈరోజు 13 బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది .

 

 సభ సజావుగా సాగితే బిల్లులు పాస్ కావడం పెద్ద కష్టమేమి కాకపోయినప్పటికీ , ఒకవేళ ప్రతిపక్ష  సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకుంటే మాత్రం బిల్లులు పాస్ చేసుకోవడం క్లిష్టంగా మారే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు . అధికార , ప్రతిపక్ష సభ్యుల వ్యవహార శైలి వల్ల లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా  అవుతోందని అన్నారు . అయినా సభ్యులు ప్రజాసమస్యలపై చర్చించకుండా తమ వ్యక్తిగత ఎజెండాతో ముందుకు సాగుతున్నారని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: