తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏల పరిస్ధితి మరీ అన్యాయంగా తయారైంది. సబ్జక్టు ఏదీ లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడేయాలి, అదికూడా జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలని ప్రయత్నిస్తే పరిస్ధితి ఆదిరెడ్డి భవానీకి అయినట్లే అవుతుంది. అసెంబ్లీలో ఉదయం మద్య నియంత్రణపై చర్చ జరిగింది.  ఈ సందర్భంగా  టిడిపి రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవానీ మాట్లాడిన మాటలకు వైసిపి సభ్యులు ఒక్కసారిగా గొల్లుమంటూ నవ్వేశారు.

 

ఎందుకంటే భవానీ మాట్లాడిందేమిటంటే ఎన్నికల సమయంలో మద్యనియంత్రణ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే ఫెయిలయ్యారు. బెల్టుషాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయట. గ్రామాల్లో నాటుసారా తయారు చేస్తున్నారట. మద్యం అమ్మకాలు జరిగే దుకాణాల్లో డిగ్రీ కురాళ్ళపై  మద్యం  కొనుక్కునే వాళ్ళు అన్ పార్లమెంటరీ పదాలు ఉపయోగిస్తున్నారట. కాబట్టి ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకు అందులో ఉద్యోగాలు ఇప్పించాలట.

 

అదే సమయంలో మద్యం ధరలు పెంచటంపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మద్యంషాపులు తగ్గిస్తామని చెప్పిన జగన్ ఆదాయాన్ని మాత్రం పెంచుకుంటున్నారట. ఇలా చాలానే మాట్లాడారు భవాని. నిజానికి ఎంఎల్ఏ మాట్లాడినదాంట్లో చెప్పుకోదగ్గ పాయింట్ ఒక్కటి కూడా లేదు. మద్యంపై దశలవారీగా నియంత్రణ తీసుకొస్తానని మాత్రమే జగన్ ఎన్నికల ముందు చెప్పారు. అలాగే చేస్తున్నారు.

 

మద్యం దుకాణాలను, బార్లను తగ్గించటమే ఇందుకు నిదర్శనం. షాపులు, బార్ల సంఖ్యను తగ్గించినా ఆదాయంలో ఎటువంటి మార్పు రాలేదంటే వాటి ధరలు పెంచేయటమే. మధ్య తరగతి, సామాన్య జనాలకు అందుబాటులో లేకుండా మద్యం ధరలను పెంచేస్తామని ముందే జగన్ చెప్పారు. అలానే చేస్తున్నారు. మద్యం ధరలు పెంచేస్తే చంద్రబాబుకైనా టిడిపికైనా వచ్చిన నష్టమేంటి ?

 

 

అలాగే టిడిపి హయాంలోని 43 వేల బెల్టు షాపులను సమూలంగా మూయించేశారు. రాష్ట్రంలో బెల్టుషాపులన్నట్లు ఎక్కడా ఆధారాల్లేవు. అలాగే నాటుసారా గ్రామాల్లో కాస్తున్నారనటం కూడా ఆధారాల్లేని ఆరోపణలే. అంటే జగన్ పై ఏదో పద్దతిలో బురద చల్లాలని ప్రయత్నిస్తున్నట్లు  భవాని మాటలే చెప్పేస్తున్నాయి. అందుకనే ఏదో గాలిని పోగేసి మాట్లాడటంతో వైసిపి సభ్యులు పెద్దగా నవ్వేయటంతో చివరకు భవాని కూడా నవ్వేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: