గ్రామాలు  దేశ అభివృద్ధి కి పట్టుకొమ్మలు అంటారు కానీ గ్రామాలను కాపాడుకుందాం అని అభివృద్ధి చేద్దాం అనుకున్న గ్రామపంచాయతీ లకు కూడా  కొందరు సహకరించడం లేదు. మద్యపాన పురుషులు ఇబ్బందులు సృష్టించి, మద్యం మీద తమ రోజు సంపాదనను చెదరగొట్టడంతో విసిగిపోయిన తెలంగాణలోని  యాదాద్రి జిల్లా రాజాపేట మండల పాముకుంట గ్రామపంచాయతీ సర్పంచ్ చిందం నర్సమ్మ మరియు ఎంపీటీసీ ఎడ్ల నరేష్ రెడ్డిపంచాయతీ కార్యదర్శి  ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు  ఇటివల ఏకగ్రీవంగా గ్రామంలోబెల్ట్ షాప్ ద్వారా మద్యాన్ని విక్రయంచే కేంద్రాలను నిలిపివేయాలని సంపూర్ణ మద్యపానం నిషేధాన్ని తీర్మానం చేసారు. గ్రామంలో బెల్ట్ షాప్ ల కారణంగా ఎంతో మంది మందుకు బానిసై జీవితాలను నాశనం చేయనుకుంటున్నారు. ప్రతిరోజు నిద్రలేవగానే మందు తీసుకోకుండా ఇలాంటి దినచర్య లు కూడా జరపకుండా మద్యానికి బానిసలవుతున్నారు అని ఇది మహిళల సమిష్టి నిర్ణయం అని  మద్యపాన వ్యసనం కుటుంబాలలో వినాశనాన్ని కలిగించింది అని ఆర్థికంగా సమస్యలను సృష్టించడంతో పాటు, కొందరు దీనివల్ల ప్రాణాలు కోల్పోయారాని అందుకే గ్రామపంచాయతీ ఈ నిర్ణయం చేసుకున్నామని సర్పంచ్  నర్సమ్మ తెలియచేసారు.ఈ నిర్ణయం పట్ల గ్రామస్థులు అందరు సంతోషించారని కొందరి పెద్దల సహకారంతోనే మళ్ళీ ఇలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఏది ఏమైనా మద్యపాన నిషేదిత గ్రామంగా పాముకుంట గ్రామం అవతరిస్తుందని సర్పంచ్,  ఎంపీటీసీ లు ఆశాభావం వ్యక్తం చేసారు.

తీర్మానం చేసిన తరువాత గ్రామంలో  చాటింపు ద్వారా అందరికి విషయాన్ని  తెలియచేసారు. కానీ  గ్రామపంచాయతీ తీర్మానాన్ని లెక్కచేయక  కొందరి అధికారుల గ్రామపెద్దలు సహకారం తో మందు విక్రయం కొనసాగిస్తూనే ఉన్నారు. దానికి ఆగ్రహించిన గ్రామస్థులు ఇంకెంతమంది ముందుకు బానిసై చనిపోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆగ్రహించిన ప్రజలు మద్యపాన నిషేధ అధికారులకు మరియు  పోలీసులకు పిర్యాదు చేసిన వారు చర్య తీసుకోవాలని వేడుకున్నారు. పోలీసులకు రెవెన్యూ అధికారులకు తీర్మాన పత్రాన్ని ఇచ్చినప్పటికీ వారు కూడా సహకరించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: