అసెంబ్లీ సమావేశాల   6 వ  రోజు చర్చలు వాడివేడీగానే మొదలు అయ్యాయి. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  పేదలకు ఇలూ కట్టించే విషయం లో గత ప్రభుత్వం పేదప్రజలకు అన్యాయం చేసింది.అంటూ  ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం విపరీతమైన దోపిడీకి పాల్పడిందని , అన్నారు. పేదవాడి ఇళ్లలో కూడా దోపిడీ చేసి వారిపై రూ.3 లక్షలకుపైగా భారం మోపాలని చూసింది అని యెద్దవా చేసారు .

 

ఈఎంఐల పేరుతో ఆ పేదవాడు 20 సంవత్సరాలు పాటు తన కష్టార్జీతాన్ని కట్టే పరిస్థితిని తీసుకొచ్చారు .కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ఆ పరిస్థితిని రూపుమాపారని, పేదవారి కోసం కడుతున్న ఇళ్లను రివర్స్‌ టెండరింగ్‌కు తీసుకెళ్లి ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదా చేయడం తో పాటు లబ్ధిదారుడికి ఇళ్లు ఉచితంగా ఇవ్వాలని అన్నారు.

 

అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ  300 చదరపు అడుగుల ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, కేంద్రప్రభుత్వం రూ.1.50 లక్షలు ఇస్తే రూ.2.65 లక్షలు లబ్ధిదారుడు లోన్‌ కింద ఒక ఇంటికి ఇవ్వాలనేది గత ప్రభుత్వ నిర్ణయం  7 లక్షలు ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం శాంక్షన్‌ తీసుకొచ్చి అందులో 5 లక్షల ఇళ్లను నిర్మించాలనుకొని అందులో 3,09,432 ఇళ్లు  కోసం మాత్రమే టెండర్లు పిలిచారు. అందులో 77,371 మాత్రమే 90 శాతం పూర్తయ్యాయి దీంట్లో లబ్ధిదారుడు డబ్బుకట్టుకోవాలి.

 

మామూలుగా ఇటికలతో కాకుండా కొత్తగా షేర్‌వాల్‌ టెక్నాలజీని తీసుకువచ్చారు. త్వరగా ఇల్లు పూర్తీ చేయాలన్నది వారి ఉద్దేశం. ఉద్దేశం బాగున్నా.. ఐదేళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా పూర్తిచేసి ఇవ్వలేదు. అందుకే రివెర్స్ టెండరింగ్ కి వెళ్ళాం రివర్స్‌టెండరింగ్‌లో పాలరాతి, సింకులు, గ్రానైట్‌లు తీసేశారని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటినిఏ మాత్రం   మార్చకుండా టెక్నాలజీ కూడా మార్చకుండా రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లాం. విశాఖ, చిత్తూరు, కృష్ణా, విజయనగరంలో సుమారు 14368 ఇళ్లకు రీ టెండర్లకు వెళితే.. దాని ఖర్చు రూ.707 కోట్లు అయితే రివర్స్‌టెండరింగ్‌లో రూ.601 కోట్లకు కోట్‌ చేశారు. అంటే రూ.106 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది.

 

సీఎం వైయస్‌ జగన్‌ మాట ఇది అంటూ . పేదవారి కోసం కడుతున్న ఇళ్లు ఉన్నాయో.. గత ప్రభుత్వం అవినీతి చేసింది. వాటిపై రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లిన తరువాత 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్లులను ఉచితంగా ఇద్దాం.. ఒక్క పైసా కూడా లబ్ధిదారుడి దగ్గర తీసుకోవద్దని చెప్పారు. గత ప్రభుత్వంలో పెద్ద పెద్ద కంపెనీలు టెండర్లలో పాల్గొన్నారు. వారంతా 5 శాతం ఎక్కవకు కోట్‌ చేశారు. ఆ 5 శాతం, ఇప్పుడు 15 శాతం తక్కువ.. అంటే మొత్తం 20 శాతం గత ప్రభుత్వం దోచుకుతిన్నది. వాస్తవానికి 3 లక్షల ఇళ్లకు రివర్స్‌టెండరింగ్‌కు వెళితే సుమారు రూ.2626 కోట్లు ఆదా అయ్యేవి. అంటూ బొత్స ఇళ్లపై లెక్కలు చెప్పారు ..
 

మరింత సమాచారం తెలుసుకోండి: