ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌..టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న హైదరాబాద్ లో బంజారాహిల్స్ లోని తన నివాసంలోనే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. అయితే అయన మృతికి అయన కూతురు, కొడుకు, చంద్రబాబు నాయుడు రాజకీయమే కారణం అని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.   

 

అయితే ఇప్పుడు తాజాగా కోడెల మృతికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇప్పటివరకు తనకు అందలేదని బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు వెల్లడించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కోడెల మరణించిన రోజు ఉదయం 11 గంటల సమయంలో నైలాన్‌ తాడుకు వేలాడుతూ కనిపించగా కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

 

చికిత్స పొందుతూనే అయన మరణించారు. సుమారు మధ్యాహ్నం 12.39కి కోడెల చివరి శ్వాస విడిచారని అధికారికంగా వెల్లడించారు. వైసీపీ పార్టీ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు అని టీడీపీ నేతలు ఆరోపించారు. అప్పట్లో ఆయన మరణం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. దీంతో పోలీసులు కూతురు, భార్య, గన్‌మాన్‌ల వాంగ్మూలం నమోదు చేసి కేసు దర్యాప్తు చేశారు. 

 

ఇక ఈ నేపథ్యంలో కోడెల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఘటనాస్థలంలో వారికి కేబుల్ వైర్ లభించింది. దీంతో కోడెల సెల్‌ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అయన మరణించి దాదాపు 3 నెలలు అవుతుంది. అయినప్పట్టికీ ఇంతవరుకు పోస్టుమార్టం రిపోర్టు రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. ఒక మాజీ మంత్రి, స్పీకర్ కేసు.. దిశ కేసు నడిచినంత ఫాస్ట్ గా కూడా నడవలేదు అంటే.. ఈ ఆత్మహత్య వెనుక ఎంతమంది రాజకీయనాయకులు ఉన్నారో చుడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: